Prema Entha Madhuram Serial: బుల్లితెరపై ప్రసారమవుతున్న ప్రేమ ఎంత మధురం సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి ప్రేమకథ నేపథ్యంలో సాగుతున్న ఈ సీరియల్ రేటింగులో టాప్ ఫైవ్ లోనే ఉంటుంది. ఇక ఆర్యను పెళ్లి కొడుకుగా రెడీ చేశాక అక్కడున్న మాన్సీ, నీరజ్, జిండే, శారదలు ఆర్యను కాసేపు ఆటపట్టిస్తారు. ఇక ఆర్య సంతోషంగా కనిపిస్తాడు. ఇక సెల్ఫీ తీసుకునే సమయంలో అక్కడే ఉన్న మీరాను కూడా పిలుస్తారు. ఫోటోలో మీరా డల్ గా కనిపించడంతో.. ఏమైంది అని మీరాను.
తనకు బాలేదు అంటూ బదిలిచ్చి తప్పించుకుంటుంది. ఇక తనతో ఉన్న అందర్నీ చూసి ఆర్య కాస్త ఫీల్ అవుతాడు. ఎందుకు అలా ఉన్నావ్ అని ఆర్యను జిండే అడగటంతో వెంటనే మాన్సీ అను కోసమై తనకు ఏర్పాట్లు చేసిన విషయం గురించి ఆలోచిస్తున్నాడేమో అని అనడంతో.. అది కాదు అంటూ.. అను వాళ్ల తల్లిదండ్రులకు ఎవరూ లేరు అంటూ.. వాళ్లకు వాళ్లే అన్నట్లుగా ఉంటారని అనడంతో అందరూ ఆలోచనలో పడి అను ఇంటికి వెళ్లి మేము తీసుకొస్తామని ధైర్యం ఇస్తారు.
అదే సమయంలో మీరాకు.. మీ శ్రేయోభిలాషి అంటూ జలంధర్ మెసేజ్ పెట్టగా అందులో తాను అనుకుంటున్న పంతులిని రానివ్వకుండా చేశానని అంటాడు. అదే సమయంలో ఆర్య వాళ్లకి కూడా పంతులు రాడని కబురు వస్తుంది. ఇక మీరాను జలంధర్ కొరియర్ తీసుకోమని కోరుతాడు. మీరా ఎవరి శ్రేయోభిలాషి అని ఆలోచనలో పడుతుంది. అంతలోనే కొరియర్ రావడంతో మాన్సీ తానే మీరా అని తీసుకుంటుంది. ఎవరులేని మీరాకు ఎవరు పంపించారని అనుకోగా అంతలోనే మీరా వచ్చి కొరియర్ ఇవ్వమని బ్రతిమాలుతుంది.
మాన్సీ ఇవ్వకపోవడంతో శారదాతో చెప్పి మొత్తానికి కొరియర్ తీసుకుంటుంది. ఇక మరోవైపు పెళ్లి కూతురు గెటప్ లో ఉన్న అను చూసి అను తల్లిదండ్రులు సంతోషంగా ఫీల్ అవుతారు. అప్పుడే తన కూతురు ఇంతా ఎదిగిపోయిందా అని ఎమోషనల్ అవుతారు. మరోవైపు జిండే, మీరా కారులో బయలుదేరగా మీరా మాత్రం మాన్సీ మాటలను తలుచుకుంటుంది. జిండే కారు ఆపడంతో ఆ కొరియర్ కింద పడిపోతుంది. వెంటనే ఆ కొరియర్ ను తీసుకొని చూసుకుంటుంది. మొత్తానికి ఎవరూ లేని మీరాకు జలంధర్ తోడు దొరికింది.