Homeఎంటర్టైన్మెంట్Prashanth Neel after Dragon movie: 'డ్రాగన్' తర్వాత అలాంటి సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై...

Prashanth Neel after Dragon movie: ‘డ్రాగన్’ తర్వాత అలాంటి సినిమాలకు శాశ్వతంగా గుడ్ బై అంటున్న ప్రశాంత్ నీల్..

Prashanth Neel after Dragon movie: జెన్ జీ యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రానికి ఆయన టేకింగ్ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు . ఎందుకంటే అప్పటి వరకు అలాంటి టేకింగ్ తో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు కాబట్టి. మాస్ ని ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయిన రోజులవి. ఈ […]

Prashanth Neel after Dragon movie: జెన్ జీ యూత్ మరియు మాస్ ఆడియన్స్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న డైరెక్టర్స్ లో ఒకరు ప్రశాంత్ నీల్. కేజీఎఫ్ చిత్రానికి ఆయన టేకింగ్ చూసి ఒక్కసారిగా అందరూ షాక్ కి గురయ్యారు . ఎందుకంటే అప్పటి వరకు అలాంటి టేకింగ్ తో వచ్చిన సినిమా ఒక్కటి కూడా లేదు కాబట్టి. మాస్ ని ఇలా కూడా చూపించొచ్చా అని అందరూ ఆశ్చర్యపోయిన రోజులవి. ఈ సినిమా తర్వాత ఆయన రెబల్ స్టార్ ప్రభాస్ తో చేసిన ‘సలార్’ కూడా యూత్ ఆడియన్స్ కి ఎంతో ఇష్టం. ఈ రెండు సినిమాలతో ఆయన బలమైన స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రశాంత్ నీల్ సినిమా అంటే చాలు , హీరో ఎవరు అనేది కూడా పట్టించుకోరు , రికార్డు స్థాయిలో టికెట్స్ ని తెంచుతారు ఆడియన్స్.

ఇకపోతే ఆయన లేటెస్ట్ చిత్రం ‘డ్రాగన్’. ఎన్టీఆర్ హీరో గా నటించిన ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ వీడియో ని రీసెంట్ గానే విడుదల చేయగా, దానికి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రశాంత్ నీల్ మార్క్ అడుగడుగునా కనిపించింది. అదే రోజున ఆయన ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూ కూడా బాగా వైరల్ అయ్యింది. ఈ ఇంటర్వ్యూ లో ఆయన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఆయన మాట్లాడుతూ ఇకపై కేజీఎఫ్ , సలార్ తరహా యాక్షన్ జానర్ చిత్రాలకు చేయనని, ‘డ్రాగన్’ తో ఆపేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. ఎందుకంటే అభిమానులు ‘సలార్ 2’ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. జెన్ జీ ఆడియన్స్ లో ఈ చిత్రం పై ఎన్నో ఆశలు ఉన్నాయి. అసలు ‘సలార్ 2’ ఉందా లేదా అని అందరూ అనుమానిస్తున్న సమయంలో , మూవీ టీం అనేక సార్లు కచ్చితంగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది.

రెండేళ్ల క్రితం కొంత భాగం షూటింగ్ ని కూడా జరుపుకున్నారు. కాబట్టి ‘సలార్ 2’, ‘కేజీఎఫ్ 3’ తర్వాతే ఆయన ఈ జానర్ సినిమాలకు గుడ్ బై చెప్తారని అంటున్నారు విశ్లేషకులు. డ్రాగన్ కూడా రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు , మొదటి భాగం జూన్ 11, 2027 వ సంవత్సరం లో విడుదల కాబోతుండగా, రెండవ భాగం డిసెంబర్ నెలలో విడుదల కాబోతుంది. జనాలు కూడా ప్రశాంత్ నీల్ ఒకే జానర్ సినిమాలు చేస్తూ పోతే , ఎదో ఒకసమయం లో చిరాకు పడే అవకాశం ఉంది. అందుకే ముందస్తుగా ఆయన ఈ జాగ్రత్తలను తీసుకున్నాడని అంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper