OG Movie Set : ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్, ప్రకాష్ రాజ్ మధ్య ఏ స్థాయిలో మాటల దాడులు జరిగాయో మన అందరికీ తెలిసిందే. తిరుపతి లడ్డు వివాదం పై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యి ఇలాంటివి భవిష్యత్తులో మళ్ళీ జరగకుండా ఉండాలంటే ‘సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు’ ని ఏర్పాటు చేసి, నిపుణులను కమిటీ మెంబెర్స్ గా పెట్టి, ఆ బోర్డు కి నిధులు కేటాయించాలి అని పవన్ కళ్యాణ్ ప్రతిపాదిస్తాడు. దీనికి ప్రకాష్ రాజ్ విమర్శలు చేస్తూ రెచ్చిపోతాడు. బీజేపీ పార్టీ అంటే మొదటి నుండి ఇష్టం లేని ప్రకాష్ రాజ్, ఆ పార్టీ తో పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పై మొదటి నుండి ఆయన సైలెంట్ గా సెటైర్లు వేస్తూనే ఉన్నాడు. కానీ పవన్ కళ్యాణ్ పెద్దగా పట్టించుకోలేదు.
రాజకీయ పరంగా ఆయన నన్ను పలుసార్లు విమర్శించాడు కానీ, నటుడిగా ఆయన దేశం గర్వించదగ్గ వ్యక్తి, ఆయనంటే నాకు చాలా గౌరవం ఉంది అంటూ వకీల్ సాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒకసారి చెప్పుకొస్తాడు పవన్ కళ్యాణ్. అయితే సనాతన ధర్మం గురించి గొంతెత్తి మాట్లాడినప్పుడు ప్రకాష్ రాజ్ సెటైర్లు వేయడం పై పవన్ కళ్యాణ్ చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు. ఇక అప్పటి నుండి నిన్న మొన్నటి వరకు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తూనే వస్తున్నాడు. రీసెంట్ గా అయితే ఆయన హద్దులు దాటి ఒక తమిళ మీడియా ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో పవన్ కళ్యాణ్ సిగ్గు లేనోడు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి పవన్ అభిమానులకు కోపం రప్పించాడు. ఒకే ఇండస్ట్రీ లో కలిసి పని చేసేవాళ్ళు, రేపు ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవాలి అనే ఇంకిత జ్ఞానం కూడా ప్రకాష్ రాజ్ కి లేదని అభిమానులు సోషల్ మీడియా లో తిట్టారు.
ప్రస్తుతం ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ పాన్ ఇండియన్ చిత్రం ‘ఓజీ’ లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. నిన్ననే ఈ సినిమాకి సంబంధించిన షెడ్యూల్ ని డైరెక్టర్ సుజిత్ ప్రారంభించాడు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్ పాల్గొన్నాడు. మరో రెండు రోజుల్లో పవన్ కళ్యాణ్ కూడా ఈ షెడ్యూల్ లో పాల్గొనబోతున్నాడు. అయితే ప్రకాష్ రాజ్ తో కాంబినేషన్ సన్నివేశాలు రాబోయే రెండు మూడు రోజుల్లో తియ్యాలని డైరెక్టర్ సుజిత్ పవన్ కళ్యాణ్ కి వివరించగా, ఆయన కాస్త అసౌకర్యంగా ఫీల్ అయ్యినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న గుసగుస. రేపు సెట్స్ లోకి పవన్ కళ్యాణ్ అడుగుపెట్టిన తర్వాత వీళ్లిద్దరు ఎదురైనప్పుడు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయో, డైరెక్టర్, నిర్మాతలు వీళ్ళిద్దరిని ఎలా మ్యానేజ్ చేస్తారో చూడాలి. ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ సారథ్యంలో ఈ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించబోతున్నారు. మరోపక్క పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ సినిమా షూటింగ్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Prakash raj entered the sets of pawan kalyans og movie pawan fires on director sujith
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com