Homeఎంటర్టైన్మెంట్Prabhas praises Konda Murali Krishna: 'కొండ మురళి కృష్ణ' ను మెచ్చుకున్న ప్రభాస్...వైరల్ అవుతున్న...

Prabhas praises Konda Murali Krishna: ‘కొండ మురళి కృష్ణ’ ను మెచ్చుకున్న ప్రభాస్…వైరల్ అవుతున్న రెబల్ స్టార్ వాయిస్ ఓవర్…

Prabhas praises Konda Murali Krishna: కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ ఉండే పోటీని తట్టుకొని యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగిన నటుడు ప్రభాస్… బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం భారీ సక్సెస్ లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇండియాలో తన ప్లాప్ సినిమాలకు సైతం భారీ వసూళ్లు వస్తున్నాయి అంటే పాన్ ఇండియాలో ఆయన క్రేజ్ ఈ రేంజ్ లో […]

Prabhas praises Konda Murali Krishna: కృష్ణం రాజు నట వారసుడిగా ఇండస్ట్రీ కి వచ్చి ఇక్కడ ఉండే పోటీని తట్టుకొని యంగ్ రెబల్ స్టార్ గా ఎదిగిన నటుడు ప్రభాస్… బాహుబలి సినిమాతో మొదటి పాన్ ఇండియా స్టార్ హీరోగా అవతరించాడు. ప్రస్తుతం భారీ సక్సెస్ లను టార్గెట్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇండియాలో తన ప్లాప్ సినిమాలకు సైతం భారీ వసూళ్లు వస్తున్నాయి అంటే పాన్ ఇండియాలో ఆయన క్రేజ్ ఈ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అలాంటి ప్రభాస్ రీసెంట్ గా చేసిన ‘రాజాసాబ్’ సినిమాతో ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయాడు…ఇక ప్రస్తుతం ‘హను రాఘవపూడి’ దర్శకత్వంలో చేస్తున్న ‘ఫౌజీ’ సినిమా విషయంలో ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇక దాంతోపాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్న ‘స్పిరిట్’ సినిమా విషయంలో కూడా ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ప్రభాస్ కి చాలామంది అభిమానులైతే ఉన్నారు.

చిన్న పిల్లలంటే ప్రభాస్ కి చాలా ఇష్టం. వాళ్లు ఏది చేసినా కూడా తనకి విపరీతంగా నచ్చుతుంది అంటూ గతంలో ప్రభాస్ పలు సందర్భాల్లో తెలియజేశారు. ఇక తెలంగాణ రాష్ట్రంలోని ‘ఫారెస్ట్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎండోన్ మెంట్ మిస్టర్’ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న కొండ సురేఖ గారి మనవడు ‘కొండ మురళి కృష్ణ’ కి రెండున్నర సంవత్సరాల వయస్సు ఉంటుంది…

‘మహా శివరాత్రి’ ని పురస్కరించుకొని ఆ బాబు లింగాష్టకం అయితే పాడాడు. ఆయన పాడిన పాటని సురేఖ సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. ఆ పాట విన్న ప్రభాస్ మంత్రముగ్ధుడైపోయాడు. ఆ పాట చాలా బాగా పాడిన ఆ బాబును బ్లెస్ చేస్తూ ప్రభాస్ ఒక వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాడు. కొండ మురళీకృష్ణ లింగాష్టకాన్ని నీ వాయిస్ తో చాలా బాగా పాడావు.

నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందంటూ ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ ఇచ్చిన ఆ వాయిస్ ఓవర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికైతే ప్రభాస్ కి ఏదైనా నచ్చితే నచ్చింది అని నిర్మామాటంగా చెబుతాడు అనడానికి ఈ వాయిస్ ఓవర్ ని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు…

 

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper