Homeఎంటర్టైన్మెంట్Ranveer Singh 40 crore fine: 'ధురంధర్' హీరో కి 40 కోట్లు జరిమానా..మరీ ఇంత...

Ranveer Singh 40 crore fine: ‘ధురంధర్’ హీరో కి 40 కోట్లు జరిమానా..మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కష్టం!

Ranveer Singh 40 crore fine: బాలీవుడ్ ఇండస్ట్రీ లో ‘డాన్’ అనే చిత్రం ఒక ప్రభంజనం. ఆరోజుల్లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ హీరో గా తెరకెక్కిన ఈ చిత్రం, ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఆ తర్వాత కొన్నాళ్ళకు ఇదే చిత్రాన్ని బాలీవుడ్ సూపర్ స్టార్ 2006 వ సంవత్సరం లో రీమేక్ చేసి భారీ బ్లాక్ బస్టర్ ని అందుకున్నాడు. 2011 లో ఈ చిత్రానికి సీక్వెల్ లో కూడా షారుఖ్ ఖాన్ హీరో గా నటించి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అలా డాన్ సిరీస్ కి అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేశారు. ఇప్పటికీ కూడా ఈ ఫ్రాంచైజ్ పై జనాల్లో మంచి క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ ని వృధా చేసే ఉద్దేశ్యం లేక ఫర్హాన్ అక్తర్ ‘డాన్ 3′(Don 3 Movie) తో ఫ్రాంచైజ్ ని కొనసాగించాలని అనుకుంది.

అందుకు హీరో గా ‘ధురంధర్'(Dhurandhar Movie) ఫేమ్ రణవీర్ సింగ్(Ranveer Singh) ని ఎంచుకున్నారు. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం లో ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రితేష్ సిద్వానీ నిర్మాణం లో ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని పూర్తి చేశారు. అయితే ఈ సినిమా నుండి కొద్దిరోజుల క్రితమే హీరో రణవీర్ సింగ్ తప్పుకున్నాడు. దీంతో ‘డాన్ 3’ మేకర్స్ తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తమకు రణవీర్ సింగ్ కారణంగా 40 కోట్ల నష్టం వాటిల్లింది అంటూ, బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో కంప్లైంట్ చేశారు. ఈ ప్రొడ్యూసర్స్ గిల్డ్ లో బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా ఒక కీలక సభ్యుడు. వాళ్ళ ముందు ‘డాన్ 3 ‘ నిర్మాతలు ఈ పంచాయితీ పెట్టినట్టు తెలుస్తోంది. రణవీర్ సింగ్ ఈ చిత్రం నుండి తప్పుకోవాలని అనుకుంటే తమకు కచ్చితంగా 40 కోట్లు చెల్లించాల్సిందే అంటూ డిమాండ్ చేశారు.

మేకర్స్ ఈ అంశంపై మాట్లాడుతూ డాన్ 3 చిత్రీకరణ కోసం 28 స్టాఫ్, 7 వానిటీ వ్యాన్స్, ఒక డీజీ ట్రూప్ ప్రతీ రోజు నాతోనే ఉండాలని రణవీర్ సింగ్ కోరాడని, అందుకు మేము అంగీకరించి పలువురు టెక్నీషియన్స్ కు అడ్వాన్స్ లు కూడా ఇచ్చామని, అంతా ఓకే అనుకున్న తర్వాత చిత్రీకరణకు సిద్ధం అవుతున్న సమయం లో రణవీర్ సింగ్ ఇలా తప్పుకున్నాడని, అన్ ప్రొఫెషనల్ గా అతని కోరికలను తమపై రుద్దాలని చూస్తున్నాడు అంటూ నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి రణవీర్ సింగ్ టీమ్ సమాధానం చెప్తూ ‘ఈ చిత్రం కోసం మా హీరో రెండేళ్ల పాటు ఎదురు చూసాడు. ఫర్హాన్ అక్తర్ ఇప్పటి వరకు హీరో కి బౌండెడ్ స్క్రిప్ట్ వినిపించలేదు. పైగా ఈమధ్య కాలం లో ఆమె హృతిక్ రోషన్ ని కూడా ఈ సినిమా కోసం సంప్రదించినట్టు మాకు తెలిసింది. ధురంధర్ చిత్రం పాన్ ఇండియా లెవెల్ లో పెద్ద హిట్ అయ్యి, మా హీరో కి మంచి క్రేజ్ వచ్చేలోపు ఇప్పుడు ఈ చిత్రం లో నటించాలంటూ ఇంత పెద్ద రచ్చ చేస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చారు. మరి రాబోయే రోజుల్లో ఏమి జరగబోతుందో చూడాలి. ఒకవేళ లీగల్ గా వెళ్తే రణవీర్ సింగ్ 40 కోట్లు కట్టాల్సిందేనా అనేది కూడా తెలియాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular