Homeఎంటర్టైన్మెంట్వర్మ నుండి మరో రాజకీయ సినిమా !

వర్మ నుండి మరో రాజకీయ సినిమా !

RGV
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు తెలిపోతూ ఏవో పిచ్చి పిచ్చి సినిమాలు చేస్తున్నాడు గానీ, ఒకప్పుడు “శివ, కంపెనీ, క్షణక్షణం, సత్య, సర్కార్ లాంటి సినిమాలతో భారతీయ సినీచరిత్రలోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఘనత వర్మది. కాకపోతే ఇదంతా గతం. వర్మ వర్తమానం నీచం. దిగజారుడు తనానికి సింబాలిజమ్. దీనికితోడు వర్మ అంటేనే కాంట్రవర్సీ, బూతు సినిమాలకు కేరాఫ్ అడ్రెస్. ఏకంగా అడల్ట్ సినిమాల ఫిల్మ్ మేకర్ గానే వర్మ స్థిరస్థాయిగా స్థిరపడిపోతాడా అన్న డౌట్స్ కూడా వచ్చేస్తున్నాయి జనానికి. అయినా వర్మకు ఆ జనం పట్టరు.

Also Read: రమ్యకృష్ణకు నైట్ అవి ఉండాల్సిందేనట !

అసలు ఇండియా అంతా ఆరాధనగా చూసే డైరెక్టర్ల సరసన నిలవాల్సిన ఆర్జీవీ కాస్తా వేస్ట్ ఫెలో అయిపోయాడు అంటే కారణం వర్మనే. నిజానికి వర్మ తలుచుకుంటే ఇప్పటికీ ఓ మంచి సినిమా తీయగలడనే నమ్మకం తోటి ఫిల్మ్ మేకర్స్ లో ఉంది. ఎందుకంటే దేశాన్ని కూడా షేక్ చేసే కాన్సెప్ట్ తో దడ పుట్టించగలిగేలా వర్మ గతంలో సినిమాలు తీశాడు. అయితే ఏ దర్శకుడైనా తమలో సత్తా అయిపోయిందనే బావన వస్తే, ఆ తర్వాత స్వచ్ఛందంగా తప్పుకుంటూ సైడ్ అయిపోతారు. ఎందుకంటే అప్పటివరకు తెచ్చుకున్న పేరు పోగొట్టుకోవడానికి ఏ దర్శకుడు ఇష్టపడదు.

Also Read: అరెస్ట్ వారెంట్ పై బాలయ్య సీరియస్ !

కానీ వర్మ మాత్రం విమర్శలపాలు అవుతున్నా తన చెత్త సినిమాల పరంపరను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. మరో సినిమాకి వర్మ రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కూడా వైజాగ్ కి చెందిన ఒక రాజకీయ నాయకుడి పై ఉంటుందట. అసలు వర్మ ఈ మధ్య కంటెంట్ ను నమ్ముకొని సినిమా తీయలేదు, కేవలం వివాదాన్ని, ప్రచారాన్ని నమ్ముకొని మాత్రమే సినిమాలు తీసుకుంటూ పోతున్నాడు. ఇంకా తీస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

2 COMMENTS

Comments are closed.

RELATED ARTICLES

Most Popular