Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. తిక్క హీరోయిన్ కి రాజకీయ పిచ్చి !

ప్చ్.. తిక్క హీరోయిన్ కి రాజకీయ పిచ్చి !

ఎలాంటి బోల్డ్ హీరోయిన్ అయినా మరీ పచ్చిగా మాట్లాడదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఎంత హాట్ బాంబ్ అయినా ఏదొక సందర్భంలో కాస్త అయినా సిగ్గును ప్రదర్శిస్తోంది ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. అసలు తనకంటూ తిక్క ఉన్న హీరోయిన్ ఎవ్వరూ ఉండరు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప. ఆ మాటకొస్తే ఈ జనరేషన్ లో ఐటమ్ క్యారెక్టర్స్ తో హాట్ సమాజాన్ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ సీఎం అవ్వాలని కలలు కనదు ఒక్క ‘కంగనా రనౌత్’ తప్ప.

ఏమైనా కంగనా ప్రత్యేకం. ఆమె ఆలోచనా విధానమే కాదు, ఆమె మాటల ప్రవాహం కూడా విభిన్నమే. అదేంటో తెలియదు గానీ జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టించ‌నప్పటి నుండి కంగనాలో చాల మార్పులు వచ్చాయి. మరి జయలలిత ఆత్మ రూపంలో కంగనా ఒంటిలోకి దూరి స్ఫూర్తిని ఇచ్చిందో ఏమో కానీ, కంగనా అచ్చంగా రాజ‌కీయ నేత‌లా మారిపోయింది. దీనికితోడు ఆ మధ్య ఝాన్సీ ల‌క్ష్మీబాయి బ‌యోపిక్ లో కూడా న‌టించిందయ్యే.

అప్పటినుండి తాను ఝాన్సీ ల‌క్ష్మినే అన్న‌ట్టుగా ఆ మధ్య చెప్పుకుని తిరిగింది. మళ్ళీ త‌ను జ‌య‌ల‌లిత బ‌యోపిక్ లో న‌టించిన తరువాత ఇక తానే జయలలితలా మారిపోయింది. అందుకే రాజ‌కీయ నేతగా శివసేన పార్టీ పై విమర్శలు చేస్తోంది. సాధార‌ణంగా ప్ర‌భుత్వాల‌ను వ్య‌తిరేకించేది ప్ర‌తిప‌క్ష పార్టీ వాళ్లు, కానీ విచిత్రంగా శివసేన ప్రభుత్వం కంగనా చేతిలో తిట్లు తినాల్సి వస్తోంది. మొత్తానికి ప్ర‌తిప‌క్షాల వాళ్లు మీడియా ముందు చేసే హ‌డావుడి కంటే..

కంగనా చేసే రాజకీయ హడావుడి ఎక్కువగా కనిపిస్తోంది మహారాష్ట్రలో. ఈ మధ్య కంగ‌నా ఎక్కువుగా జనం ఉన్న ప్లేస్ లకు వెళ్తుంది అని.. అక్కడ అందర్నీ చూసి కార్లోంచి కావాలని దిగడం, పైగా దిగేటప్పుడు అచ్చం పొలిటీషియ‌న్ లా పోజులివ్వడం వంటివి ఆమెలో కొత్తగా వచ్చిన మార్పులు అని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ హాట్ తిక్క హీరోయిన్ కి రాజ‌కీయాలు బాగా వంట‌బ‌ట్టిన‌ట్టుగా ఉన్నాయి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Dharmendra Pradhan

Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధానే కాదు.. మనదేశంలో ఎంతమంది మంత్రులు రాజీనామాలు చేశారో తెలుసా..

Dharmendra Pradhan: ప్రజాగ్రహం పెరిగిపోతే ఎంతటి వారైనా సరే తల వంచాల్సిందే. ముఖ్యంగా యువత గట్టిపట్టు పడితే గొప్ప గొప్ప నాయకులు సైతం వెనకడుగు వేయాల్సిందే. మనదేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన...
ABN Radhakrishna

ABN Radhakrishna: ఆర్కే కొత్త పలుకు.. బొద్దింకలకు వత్తాసు పలికిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ

ABN Radhakrishna: ఏ ఎండకు తగ్గట్టుగా ఆ తరహా గొడుగులు పట్టే వాళ్లను అవకాశవాదులు అంటారు. దీనిని ఇంగ్లీషులో ట్రెండ్ అని పిలుస్తుంటారు గాని.. ఒక స్థిరమైన అభిప్రాయం లేకుండా.. ట్రెండును మాత్రమే...
Maruti Suzuki Brezza

Maruti Suzuki Brezza: మారుతి సుజుకీ Brezza.. ఇప్పుడు ఫేస్ లిప్ట్ లో.. ఎలా ఉండబోతుందంటే..

Maruti Suzuki Brezza: ఆటోమొబైల్ మార్కెట్లో మారుతి సుజుకీ కార్ల కంపెనీకి ప్రత్యేక స్థానం ఉంది. మిడిల్ క్లాస్ నుంచి ఉన్నత వర్గాల వరకు అనుకూలమైన కార్లు ఈ కంపెనీ అందిస్తుందని కొందరి...
today horoscope

Today Horoscope: ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న డబ్బు వసూలు..

Today Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి కొన్ని రాశుల వారు...
July 2026 Horoscope

Today horoscope in telugu 26.7.2026 : ఈ ఐదు రాశుల వారికి అనుకూలం.. పెండింగ్ లో ఉన్న...

Today horoscope in telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆదివారం ద్వాదశ రాశులపై మూల నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు కొన్ని రాశుల వారికి అనుకోకుండానే శుభ ఫలితాలు రానున్నాయి. మరి...
Oktelugu Epaper