spot_img
Homeఎంటర్టైన్మెంట్Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల మృతి నన్నెంతగానో బాధించింది అంటున్న... ప్రధాని నరేంద్ర మోదీ

Sirivennela Seetharama Sastry: సిరివెన్నెల మృతి నన్నెంతగానో బాధించింది అంటున్న… ప్రధాని నరేంద్ర మోదీ

Sirivennela Seetharama Sastry: ప్రముఖ కవి, గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల తెలుగు రాష్ట్రాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సిరివెన్నెల లేని లోతు కేవలం తెలుగు పరిశ్రమకే కాక యావత్ భారతంలోని సాహిత్య అభిమానులను కలిచివేసింది. సిరివెన్నెల మరణంపై రాజకీయ నాయకులు, సినీ ప్రేమికులు, సాహిత్య అభిమానులు ఎందరో తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. తాజాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా సిరివెన్నెల మరణంపై ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు.

Sirivennela Seetharama Sastry
pm narendra modi emotional post about sirivennela seetharama sastry

ఈ మేరకు ఆ పోస్ట్ లో ’ అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నల గారి మృతి నన్నెంతగానో బాధించింది. ఆయన రచనల్లో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు ,స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి .‘ అంటూ ట్విట్టర్ లో తన సంతాపాన్ని తెలియజేశారు. ఈ సంధర్భంగా రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి పద్మ శ్రీ అందుకుంటున్న ఫోటోను పోస్ట్ చేశారు.

Also Read: త్రివిక్రమ్​ను ఓదార్చిన పవన్​కళ్యాణ్​.. సిరివెన్నెల భౌతికగాయానికి నివాళి

విశ్వనాధ్ దర్శకత్వం వహించిన సిరివెన్నెల సినిమాతో రచయితగా తన కెరీర్ ప్రారంభించిన సిరివెన్నెల గారు దాదాపు 3000 పైగా పాటలను రచించారు. రుద్రవీణలోని “లలిత ప్రియ కమలం విరిసినదీ” పాటకు జాతీయ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి 11 సార్లు ఉత్తమ గేయ రచయితగా నంది అవార్డులు… 4 సార్లు ఫిలింఫేర్‌ అవార్డులను సిరివెన్నెల అందుకున్నారు. అలాగే 2019లో భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఒక దిగ్గజాన్ని చిత్ర పరిశ్రమ కోల్పోయిందని సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా సంఘీభావాన్ని తెలియజేస్తున్నారు.

Also Read: మన రాకలు, పోకలు మన చేతుల్లో ఉండవు – సిరివెన్నెల సీతారామశాస్త్రి

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper