Homeఎంటర్టైన్మెంట్Tollywood: ఈ వారం ధియేటర్లలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు...

Tollywood: ఈ వారం ధియేటర్లలో సందడి చేయనున్న తెలుగు సినిమాలు…

Tollywood: 2021 సంవత్సరానికి చివరి నెలగా డిసెంబర్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత టాలీవుడ్ లో సీనియర్ స్టార్ హీరో సినిమా ఇప్పటివరకు ధియేటర్స్ లో రిలీజ్ కాలేదు. ఈ వారం బాలయ్య ఆ లోటును తీరుస్తున్నాడు. ఈ తరుణంలో ఈ వారంలో ధియేటర్స్ లో విడుదల కాబోతున్న సినిమాల వివరాలు మీకోసం ప్రత్యేకంగా…

Tollywood
tollywood movies list which are going to release in december first week

అఖండ : బాలయ్య – బోయపాటి హ్యాట్రిక్ మూవీ కాంబోలో వస్తున్న చిత్రం అఖండ. సింహా, లెజెండ్ తర్వాత వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న సినిమా కావడంతో నందమూరి అభిమానుల్లో ఈ చిత్రంపై భారీగా ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. అందులో కొవిడ్ సెకండ్ వేవ్ తర్వాత పెద్ద సినిమా అదీ బాలయ్య సినిమా కావడంతో ట్రేడ్ వర్గాల అంచనాలు హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డిసెంబర్ 2 న ధియేటర్లలో బాలయ్య గర్జించడం ఖాయమని మూవీ యూనిట్ గట్టిగా చెబుతుంది. ఈ సినిమాలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్, జగపతి బాబు, పూర్ణ ప్రముఖ పాత్రలు పోషిస్తున్నారు.

Tollywood
Akhanda

మరక్కార్ : మలయాళీ స్టార్ మోహన్ లాల్ తో పాటూ కీర్తి సురేశ్, అర్జున్, సునీల్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్ వంటి భారీ స్టార్ కాస్ట్ తో వస్తున్న చిత్రం మరక్కార్. ఈ మూవీ ని ప్రియదర్శన్ డైరెక్ట్ చేసారు. అరేబియా సముద్ర సింహం అన్న సబ్ టైటిల్ తో రాబోతున్న ఈ మూవీ 100కోట్ల బడ్జెట్ తో తెరకెక్కింది. డిసెంబర్ 2న నేషనల్ వైడ్ రిలీజ్ కాబోతుంది మరక్కార్. రిలీజ్ కు ముందే జాతీయ అవార్డును దక్కించుకుంది ఈ సినిమా. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Tollywood
Tollywood

Also Read: Akhanda Movie Dialogues, Balayya Babu Akhanda Dialogues

స్కైలాబ్ : నిత్యామీనన్, సత్యదేవ్ లీడ్ రోల్స్ లో ఫుల్ ఫన్ మూవీ ‘స్కైలాబ్’. నిత్యామీనన్ నిర్మించిన ఈ సినిమాను విశ్వక్ ఖండేరావు డైరెక్ట్ చేసాడు. డిసెంబర్ 4న డేట్ ఫిక్స్ చేసుకొని ఫుల్ స్వింగ్ లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు మూవీ టీమ్. 1973 స్కైలాబ్ ఉదాంతాన్ని బేస్ చేసుకొని కామెడీగా ఈ సినిమాను మేకొవర్ చేసారు విశ్వక్. ఇందులో జర్నలిస్ట్ గా కనిపించే నిత్యామీనన్ పూర్తి తెలంగాణ యాసలో మాట్లాడారు. సత్యదేవ్ తో పాటూ రాహుల్ రామకృష్ణ కూడా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసిన స్కైలాబ్ కూడా ఖచ్చితంగా ఆడియెన్స్ అలరిస్తుందని మేకర్స్ భావిస్తున్నారు.

Tollywood
Skylab

Also Read: తొలి సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న కొందరు ప్రముఖులు

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular