Homeఎంటర్టైన్మెంట్Pawan Kalyan Mogulaiah: ‘బీమ్లా నాయక్’ గాయకుడు మొగులయ్యకు పవన్ 2 లక్షల సాయం

Pawan Kalyan Mogulaiah: ‘బీమ్లా నాయక్’ గాయకుడు మొగులయ్యకు పవన్ 2 లక్షల సాయం

Pawan donates Rs 2 lakh to ‘Beemla Nayak’ singer Mogulayya : ఎక్కడో నల్లమల అడవుల్లో సంప్రదాయ వాయిద్యాలతో పాటలు పాడుకునే ‘కిన్నెర కళాకారుడు’ మొగులయ్య గురించి మొన్నటి వరకు ఎవరికీ తెలియదు.. కానీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆయన్ను గుర్తించాడు. గుర్తించడమే కాదు.. తన సినిమాల్లో పాట పాడే అవకాశం ఇచ్చాడు. అంతటితో ఆగకుండా తాజాగా తన చేతుల మీదుగా స్వయంగా ఆర్థిక సాయం కూడా చేశాడు..

జానపదం అంటే పవన్ కళ్యాణ్ కు ప్రాణపదం.. ఆయన ప్రతీ సినిమాలోనూ కనమరుగైపోతున్న తెలుగు జానపదాలను ఏర్చి కూర్చి తన సినిమాల్లో ఆలపించి గుర్తింపునిస్తుంటాడు. ఆ కళాకారులను పైకి తీసుకొస్తుంటాడు. ‘ఖుషీ’ నుంచి నేటి ‘బీమ్లా నాయక్’ వరకు ఏపీ, తెలంగాణలోని కళాకారుల జానపద గేయాలు ఖచ్చితంగా ఉండేలా పవన్ చూసుకుంటాడు. ఆ కళను బతికించేందుకు కళాకారులను ఆదుకునే విషయంలో పవన్ ఎప్పుడూ వెనకడుగు వేయడు.

తాజాగా ‘భీమ్లా నాయక్’ సినిమాలోని టైటిల్ సాంగ్ ను కిన్నెర కళాకారుడు మొగులయ్యతో పవన్ పాడించాడు. ఈ గొప్ప అవకాశాన్ని ఇవ్వడమే కాదు.. అంతటితో ఊరుకోకుండా రూ.2 లక్షల ఆర్థిక సాయం తాజాగా ప్రకటించి మొగలయ్యకు హైదరాబాద్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా  చెక్కును పవన్ అందజేశారు.

‘భీమ్లా నాయక్’సినిమాలో హీరోను పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకు రూ.2 లక్షల ఆర్థిక సాయంను జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ కొద్దిసేపటి క్రితం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే పవన్ కల్యాణ్ ఆ కళాకారుడు మొగులయ్యకు ఈ ప్రోత్సాహకం అందించినట్టు తెలిపాడు.

మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపించే ఈ టాలెంట్ ను ప్రపంచానికి పరిచయం చేయాలని పిలుపునిచ్చాడు. అందుకే తన ‘భీమ్లా నాయక్’ సినిమాలో అవకాశం కల్పించానన్నాడు. తాజాగా పవన్ కల్యాణ్ తన ట్రస్టు ‘పవన్ కల్యాణ్ లెర్నింగ్ సెంటర్ ఫర్ హ్యూమన్ ఎక్సిలెన్స్’ ద్వారా రూ.2 లక్షలు మొగులయ్యకు అందించాడు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Bank Loans

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...
women stress at home

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....
Kajal Aggarwal birthday

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper