spot_img
Homeఎంటర్టైన్మెంట్Oscar Awards 2025 Winners List: 2025 ఆస్కార్ అవార్డ్స్ ప్రకటన.. సత్తా చాటిన బ్లాక్...

Oscar Awards 2025 Winners List: 2025 ఆస్కార్ అవార్డ్స్ ప్రకటన.. సత్తా చాటిన బ్లాక్ బస్టర్ చిత్రం!

Oscar Awards 2025 Winners List: 2025 వ సంవత్సరం కి గాను ఆస్కార్ అవార్డ్స్(Oscar Awards 2025) వేడుక రీసెంట్ గానే లాస్ ఏంజిల్స్ లో గ్రాండ్ గా మొదలైంది. ఈ అవార్డ్స్ లో టైటానిక్ హీరో లినార్డో డికాప్రియో(Leonardo Dicaprio) హీరో గా నటించిన ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనథర్'(One Battle After Another) మూవీ కి ఆస్కార్ అవార్డు దక్కింది. 2025 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమాకు 210 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గత ఏడాది విడుదలైన హాలీవుడ్ చిత్రాల్లో ది బెస్ట్ వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా ఈ చిత్రం గురించి చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రానికి హాలీవుడ్ లో వివిధ క్యాటగిరీలలో ప్రతిష్టాత్మక అవార్డ్స్ సొంతం అయ్యాయి. ఇప్పుడు ఆస్కార్ అవార్డు కూడా తోడు అవ్వడం విశేషం . కేవలం ఉత్తమ చిత్రం అవార్డు క్యాటగిరీలోనే కాకుండా, వివిధ విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డులను కైవసం చేసుకుంది.

Also Read: నార్త్ లో అల్లు అర్జున్ మేనియా నడుస్తుందా..? ఆ బాలీవుడ్ స్టార్ నేను నీ సినిమాలో చేస్తాను బన్నీ అని అడిగాడా..?

ఈ చిత్రం లో షాన్ పెన్ కి ఉత్తమ సహాయ నటుడు గా ఆస్కార్ అవార్డు ని అందుకోగా, కాస్టింగ్ విభాగం లో కాసాండ్రా అవార్డుని సొంతం చేసుకున్నాడు. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన పాల్ థామస్ అండర్సన్ ఉత్తమ దర్శకుడు క్యాటగిరీలో అవార్డు ని కైవసం చేసుకున్నాడు. ఉత్తమ నటుడి క్యాటగిరీ లో లినార్డో డికాప్రియో అవార్డు ని కైవసం చేసుకుంటాడని అంతా అనుకున్నారు కానీ, సిన్నర్స్ చిత్రానికి గానూ మైఖేల్ బి జోర్దాన్ ఈ అవార్డు ని అందుకున్నాడు. అదే విధంగా ఉత్తమ నటి క్యాటగిరీ లో జెస్సి బాక్లీ హామ్నెట్ అనే చిత్రానికి అవార్డు ని అందుకోగా, ఉత్తమ సహాయ నటి క్యాటగిరీ లో ఏమీ మాడిగన్ వెపన్స్ అనే చిత్రానికి అవార్డుని కైవసం చేసుకుంది. ఇక యానిమేషన్ ఫిలిమ్స్ క్యాటగిరీలో కేపాప్ డిమోన్ హంటర్స్ చిత్రానికి ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు దక్కగా, ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగం లో ‘ది గర్ల్ హు క్రేడ్ పెరల్స్ ‘ చిత్రానికి అవార్డు సొంతమైంది.

అదే విధంగా ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్ విభాగం లో ఫ్రాంకెన్ స్టైన్ అవార్డు ని కైవసం చేసుకోగా, ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగం లో కూడా ఫ్రాంకెన్ స్టైన్ ఈ అవార్డు ని సొంతం చేసుకుంది. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం గా ‘ది సింగర్స్’, ‘టు పీపుల్ ఎక్స్ చేంజ్ సలైవ’ వంటి చిత్రాలు అవార్డులను కైవసం చేసుకోగా, ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ అవార్డు ని ‘ది సిన్నర్స్ ‘ సినిమా సొంతం చేసుకుంది. ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం గా ‘ఆల్ ది ఎంప్టీ రూమ్స్ ‘ చిత్రం అవార్డుని సొంతం చేసుకోగా, ఉత్తమ సౌండింగ్ విభాగం లో ఎఫ్ 1 , ఉత్తమ ఎడిటింగ్ విభాగం లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనధర్’ చిత్రం అవార్డుని సొంతం చేసుకుంది. అదే విధంగా ఉత్తమ సినిమాటోగ్రఫీ విభాగం లో సిన్నర్స్ చిత్రం అవార్డు ని కైవసం చేసుకోగా, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ క్యాటగిరీ లో ‘అవతార్ – ది ఫైర్ అండ్ వాటర్ ‘ చిత్రం అవార్డుని కైవసం చేసుకుంది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Banana Benefits

Banana Benefits: అరటిపండు ఈ టైంలో తినొచ్చా..ఎవరు తినకూడదు..

Banana Benefits: మార్కెట్లో విరివిగా లభించే పండ్లలో అరటిపండు ఒకటి. ఇది రుచితో పాటు శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు, పొటాషియం, విటమిన్ B6, ఫైబర్ వంటి పోషకాలను అందిస్తుంది. చిన్నారుల నుంచి పెద్దల...
July 26 Zodiac Predictions

July 26 Zodiac Predictions: జూలై 26 నుంచి ఈ ఆరు రాశుల వారికి పండుగే.. ఎలాగంటే

July 26 Zodiac Predictions: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల్లో మార్పుల కారణంగా కొన్ని రాశుల స్థానాలు మారుతూ ఉంటాయి. జూలై 26 నుంచి గురు చంద్రుల మధ్య ఏర్పడనున్న రాశి పరివర్తన...
Japan Heatwave

Japan Heatwave: అధిక ఉష్ణోగ్రతలతో హీటెక్కుతున్న జపాన్.. హ్యుమన్ ఫ్రిడ్జ్ వాడుతున్న జనం.. అసలేంటిది..

Japan Heatwave: సాధారణంగా ఆహ్లదకరమైన వాతావరణాన్ని కలిగి ఉండే జపాన్ ఇప్పుడు అధిక ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరుకోవడంతో అక్కడి...
Lenin Success

Lenin Success: లెనిన్ హిట్ తో దర్శకుడి జాతకం మతిపోయింది… స్టార్ హీరోతో మూవీ సెట్ చేసుకున్నాడుగా…

Lenin Success: అఖిల్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని అఖిల్... మొదటి సినిమాతోనే బుక్క బోర్లపడ్డాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన కెరియర్ లో ఒక్క సక్సెస్ కూడా దక్కలేదు. ఎట్టకేలకు...
Oktelugu Epaper