Niharika: మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగశౌర్యతో జంటగా ఒక మనసు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచమైంది ఈ భామ. అనంతరం పలు సినిమాల్లో నటించిన అవి అంత గుర్తింపు తీసుకురాలేదనే చెప్పాలి. కాగా చైతన్యతో నిహారికాకు వివాహం జరిగిన విషయం అందరికీ తెలిసిందే. వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక… ఇప్పుడు నిర్మాతగా మారినట్లు తెలుస్తుంది. ఓటీటీ వేదికగా ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించింది నిహారిక.
మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా విడుదల కానుంది. నవంబర్ 19 నుంచి ప్రసారం కానున్న ఈ సిరీస్ టీజర్‌ని తాజాగా నాచురల్ స్టార్ నాని విడుదల చేశారు.
Here’s the teaser of #OkaChinnaFamilyStory. My best wishes to the team. looks fun:)https://t.co/hoq2wzjLvo#ZEE5Original #OCFSonZEE5 #Premieres19thNovember@IamNiharikaK #SangeethShobhan #SimranSharma #MaheshUppala @ItsActorNaresh #Thulasi @Padmak131 @getupsrinu3 @ZEE5Telugu
— Nani (@NameisNani) October 31, 2021
ఈ వీడియోలో ఇంటి పక్కన వాళ్ల నుంచి పండ్లు అమ్మేవారి వరకూ… ప్రతి ఒక్కరూ ‘మహేశ్’ అని పిలుస్తూ కనిపించారు. ‘‘నేనే మహేశ్ మీకో స్టోరీ చెబుతా. ఇందులో ఓ అమ్మ, నాన్న, బామ్మ స్టోరీ ఇంతే అయితే బాగుండేది. కానీ మా నాన్న అందరికీ కలిపి ఓ పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు అంటూ సంగీత్ శోభన్ చెప్పే డైలాగ్‌లు, మధ్యతరగతి నిరుద్యోగిగా ఆయన పలికించిన హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఓ మధ్యతరగతి నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీదపడితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. ఈ సిరీస్ లో నటి తులసీ, నరేశ్ కీలకపాత్రలు పోషించారు.