Niharika: గత కొంతకాలంగా సోషల్ మీడియా వేదికగా మెగా డాటర్ నిహారిక ‘ఓసీఎఫ్‌ఎస్’ అనే హ్యాష్ ట్యాగ్ తో పోస్ట్ లు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఓసీఎఫెఎస్ అంటే ఏంటా అని ఆలోచనలో పడ్డారు నెటిజన్లు. కాగా తన తండ్రి నాగబాబు పుట్టిన రోజు సందర్భంగా దానికి అర్థమేమిటో చెప్పేసింది నిహారిక. ఓసీఎఫ్ఎస్ అంటే ” ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ ” రివీల్ చేసి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఈరోజు నాగబాబు బర్త్ డే సందర్భంగా ఓటీటీ వేదికగా నిర్మిస్తున్న తన కొత్త ప్రాజెక్ట్ వివరాలను అభిమానులతో షేర్ చేసింది ఈ భామ. చైతన్యతో వివాహం అనంతరం సినిమాలకు దూరంగా ఉంటున్న నిహారిక… ఇప్పుడు నిర్మాతగా మారినట్లు తెలుస్తుంది. ఓటీటీ వేదికగా ‘ఓసీఎఫ్ఎస్’ అనే వెబ్ సిరీస్ ను నిర్మించనుంది నిహారిక. మహేశ్ ఉప్పల దర్శకత్వంలో వస్తున్న ఈ వెబ్ సిరీస్‌లో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. నేడు ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ లుక్‌ని విడుదల చేశారు.
ప్రముఖ నటులు నరేశ్, తులసి ఈ వెబ్ సిరీస్ లో కీలకపాత్రలు పోషించనున్నారు. ఈ వెబ్ సిరీస్‌లో 40 నిమిషాల నిడివితో మొత్తం 5 ఎపిసోడ్లు ఉంటాయని తెలిపారు. జీ5 లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుందని… నవంబరు 19న ప్రీమియర్స్ ఉండనుందని వెల్లడించారు. ఈ సందర్భంగా భర్త చైతన్య, అన్న వరుణ్‌తేజ్‌తో పాటు తల్లిదండ్రులతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.