Oka Chinna family Story: మహేశ్ ఉప్పల దర్శకత్వంలో సంగీత్ శోభన్, సిమ్రాన్ శర్మ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న వెబ్ సిరీస్ “ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ”. మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక ఈ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరించనుంది. ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా నవంబర్ 19 నుంచి ఈ సిరీస్ ప్రసారం కానుంది. ఇటీవల నేచురల్ స్టార్ నాని విడుదలైన టీజర్ కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ఇప్పుడు తాజాగా ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ను కింగ్ నాగార్జున చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ మ్నెరకు సోషల్ మీడియా వేదికగా నాగ్ ఈ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. మన అందరికీ ఫ్యామిలీ ప్యాక్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ వస్తుంది అని నాగార్జున అన్నారు. అలానే ఈ ట్రైలర్లో నరేష్, సంగీత్ శోభన్ మధ్య డైలాగులు వినోదాత్మకంగా ఉన్నాయి. అమ్మాయి వంద రూపాయలు అడిగితే… జేబు తడుము కోగా రూపాయి మాత్రమే ఉండటం, అది చూసి హీరోయిన్ వెళ్లడంతో తర్వాత ఏమైందనేది ఆసక్తిగా మారింది. ఓ మధ్యతరగతి నిరుద్యోగ యువకుడికి అనుకోకుండా అప్పుల బాధలు మీదపడితే ఎలా ఉంటుంది అనేది స్టోరీ. ఈ సిరీస్ లో నటి తులసీ, నరేశ్ కీలకపాత్రలు పోషించారు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందర్నీ ఆకట్టుకునే సిరీస్ ఇదని నిహారిక తెలిపారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
Next #ZEE5Original #OkaChinnaFamilyStory mana andhariki family-pack of entertainment ivvabothundhi!
Happy to launch the trailer of #OCFSOnZEE5https://t.co/eyrOeTen7i#Premieres19thNov exclusively on @ZEE5Telugu@IamNiharikaK #SangeethShobhan #SimranSharma #Mahesh #Manasa— Nagarjuna Akkineni (@iamnagarjuna) November 8, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Oka chinna family story web series trailer released by king nagarjuna
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com