Balakrishna Mohan Babu:చిరంజీవి, నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ లాగానే ఆశ్చర్యకరంగా బాలయ్య కూడా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. ఫస్ట్ టైం అల్లు అరవింద్ సారథ్యంలోని ‘ఆహా’ ఓటీటీ కోసం ఒక షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. దానిపేరే ‘అనస్టాపబుల్ విత్ ఎన్.బీ.కే’. ఈ చాట్ షో టీజర్ విడుదలైంది. వైరల్ అవుతోంది.

బాలక్రిష్ణ హోస్ట్ గా చేస్తున్న ఈ తొలి షోకు మోహన్ బాబు, మంచు విష్ణు, మంచు లక్ష్మీ లు అతిథులుగా వచ్చారు. ఈ షోలో బాలయ్య కాస్త ఫన్నీగా.. చురకత్తుల్లాంటి ప్రశ్నలు అడిగాడు.
తాజాగా చిరంజీవితో మీ విభేదాలు ఎందుకు అని బాలయ్య సూటిగా మోహన్ బాబు ను ప్రశ్నించాడు. దీనికి ‘అల్లు అరవింద్ అడగమన్నాడా?’ అంటూ మోహన్ బాబు కౌంటర్ ఇచ్చాడు.
ఇక అన్నింటికంటే పెద్ద ప్రశ్న మోహన్ బాబు అడగడం విశేషం..‘నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని చంద్రబాబు చేతుల్లో ఎందుకు పెట్టారు? మీరెందుకు టేకప్ చేయలేదు’ అని ఒక ఘాటు సంచలన ప్రశ్నను బాలయ్యకు సంధించాడు మోహన్ బాబు.. దీనికి బాలయ్య సీరియస్ అయ్యాడు. ఏదో చెప్పబోయాడు కానీ ప్రోమోలో కట్ చేసి పడేశారు. దీంతో బావ చంద్రబాబుకు టీడీపీని ఎందుకు అప్పగించామన్నది బాలయ్య చెప్పినట్టే ఉన్నాడు. ఇక అన్న గారి టీడీపీ పార్టీని వదిలేసి మీరెందుకు వైసీపీలో చేరారు అంటూ బాలయ్య కూడా ఒక స్ట్రాంగ్ ప్రశ్నను మోహన్ బాబును అడిగారు. దానికి ఫిట్టింగ్ పెట్టారు కొందరు అని మోహన్ బాబు నిజాలు చెప్పుకొచ్చారు.
నవంబర్ 4 నుంచి దీపావళి కానుకగా ఈ షో ‘ఆహా’ ఓటీటీలో ప్రసారం కానుంది. మొదటి షోలో ఈ ఆసక్తికర ప్రశ్నలకు బాలయ్య, మోహన్ బాబులు ఏం సమాధానం ఇచ్చారన్నది ఆసక్తి రేపుతోంది. ప్రోమోను కింద చూడొచ్చు.