Homeఎంటర్టైన్మెంట్ఎక్స్ క్లూజివ్ : బావమరిదిని హీరోని చేస్తోన్న ఎన్టీఆర్ !

ఎక్స్ క్లూజివ్ : బావమరిదిని హీరోని చేస్తోన్న ఎన్టీఆర్ !

Jr NTRహీరో అయిపోవాలని, సినిమా రంగంలో ఎలాగోలా ఎంట్రీ ఇచ్చేయాలని చాలామంది కుర్రాళ్లకు ఉంటుంది. ఇక సినీ ప్రముఖుల కుటుంబాలలోని పిల్లలకు అయితే, మరి ఎక్కువగా ఉంటుంది. చుట్టూ స్టార్ డమ్, కోట్ల రూపాయల సంపాదన, పైగా గౌరవం, అలాగే బోలెడంత గుర్తింపు. అందుకే ఇప్పుడు ఓ స్టార్ హీరో ఫ్యామిలీ నుండి మరో హీరో ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసింది.

హీరో కావాలని కలలు కంటున్న ఆ హీరో ఎవరంటే.. పేరు నితిన్. అన్నిటికీ మించి జూనియర్ ఎన్టీఆర్ కి స్వయాన బావమరిది. ఎన్టీఆర్ సతీమణి తమ్ముడు. బావగారి రేంజ్ ను చూసిన నితిన్ నార్నే, మొత్తానికి హీరో కావాలని ఆశ పడుతున్నాడు. ఎంతైనా నార్నే ఎస్టేట్స్ నార్నే శ్రీనివాసరావు కుమారుడు కాబట్టి, ఎన్టీఆర్ సపోర్ట్ లేకుండా కూడా హీరో అయిపోవచ్చు.

కాకపోతే ఎన్టీఆర్ కి స్వంత బావమరిది కాబట్టి, ఇతగాడికి ఎన్టీఆర్ అండ లభించడం ఖాయం. ఎన్టీఆర్ తలుచుకుంటే నితిన్ నార్నేను హీరోగా పెట్టి, మంచి డైరెక్టర్ ను సెట్ చేసి సినిమా తీయించడం అనేది చాల ఈజీ. కానీ కుర్రాడు యాక్టింగ్ బాగా చేయకపోతే ముందు బ్యాడ్ నేమ్ ఎన్టీఆర్ కే. అందుకే ప్రస్తుతం యాక్టింగ్ కోర్స్ నేర్పిస్తున్నారట.

యాక్టింగ్ గురు సత్యానంద్ దగ్గర ప్రస్తుతం నటనలో మెళకువలు నేర్చుకుంటున్నాడట.అలాగే హీరోగా నితిన్ నార్నే ఎలా వుంటాడు ? అతన్ని జనం ఎలా రిసీవ్ చేసుకుంటారు ? అసలు అతనిలో హీరో మెటీరియల్ వుందా లేదా ? అనే కోణంలో కూడా ఎన్టీఆర్ టీమ్ ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ఎన్టీఆర్ బావమరిది త్వరలోనే హీరోగా లాంచ్ అవ్వడానికి రెడీ అవుతున్నాడు. మొత్తమ్మీద ఇండస్ట్రీలో స్టార్ హీరోల ఫ్యామిలీస్ నుంచి కొత్త హీరోల పరంపర ఇంకా కొనసాగుతూనే ఉంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Varanasi Teaser

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...
Monsoon Health Tips

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...
Furniture Rental

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...
Oktelugu Epaper