
అత్యంత వేగంగా వ్యాపించే ఆ వేరియంట్ వల్లే ఇండియలో ఇంతటి కరోనా విలయం ఏర్పడిందని అన్నారు డబ్ల్యూహెచ్ వో చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్. ఈ వేరియంట్ వ్యాక్సిన్లనూ బోల్తా కొట్టించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. ఏఎఫ్ పీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను వెల్లడించారు. కరోనాకు చెందిన B.1.617 వేరియంటే ఈ విపత్తుకు కారణమని ఆమె తెలిపారు. దీనిని తొలిసారి ఇండియాలోనే గతేడాది అక్టోబర్ లో గుర్తించారు. దీనిని ఒక ప్రత్యేకమైన వేరియంట్ గా డబ్ల్యూహెచ్ వో కూడా ఈ మద్య లిస్ట్ చేసింది.