
కరోనా మహమ్మారి దేశ రాజధాని దిల్లీని అతలాకుతలం చేస్తోంది. కరోనా తీవ్రత కొనసాగుతుండటంతో ఇప్పటికే అమల్లో ఉన్న లాక్ డౌన్ మరో వారం పాటు కేజ్రీ వాల్ ప్రభుత్వం పొడిగించింది. ఈ నెల 17 వరకూ లాక్ డౌన్ అమల్లో ఉంటుందని సీఎం క్రేజీవాల్ ప్రకటించారు. ఈసారి మరింత కఠినంగా ఉంటుందని తెలిపారు. మెట్రో సేవలు కూడా పూర్తిగా నిలిచిపోనున్నాయని వెల్లడించారు. దిలలీలో పాజిటివిటీ రేటు కాస్త తగ్గినప్పటికీ లాక్ డౌన్ కొనసాగించాలనే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.