Nandamuri Young Heroes: సినిమా ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా చాలా మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు బాలయ్య బాబు (Balayya Babu)…తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతూ ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు ఒకెత్తయితే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి. ఆయన కొడుకు అయిన మోక్షజ్ఞ కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్న సమయంలో మోక్షజ్ఞ ఎదగడానికి కావలసిన జాగ్రత్తలన్నింటిని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన లైనప్ లో ముగ్గురు డైరెక్టర్లు ఐతే ఉన్నారు. ఇక మోక్షజ్ఞ ఎంట్రీ ఎప్పుడు ఉంటుంది.అనేదాని మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు. కానీ మోక్షజ్ఞకు పోటీ గా నందమూరి జానకిరామ్ కొడుకు అయిన ఎన్టీఆర్ పోటీకి వస్తున్నాడు.ఇక వీళ్లిద్దరిలో ఎవరు స్టార్ హీరోగా ఎదుగుతారు ఎవరు డిలా పడిపోతారు అనే దానిమీదనే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి అయితే నెలకొంది. ఒక రకంగా చెప్పాలంటే నందమూరి జానకిరామ్ కొడుకుని జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చేస్తున్నాడు. ఇక మోక్షజ్ఞను బాలయ్య బాబు ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు.
Also Read: ప్రభాస్ తో ఆ సినిమా చేస్తే బాగా వర్కౌట్ అవుతుందా..?
వీళ్ళ మధ్య టఫ్ ఫైట్ అయితే ఉంది. మరి ఇందులో ఎవరు రాణిస్తారు? ఎవరు డీలా పడతారు అనే దాని మీదనే నందమూరి అభిమానులతో పాటు ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య మధ్య మాత్రం కొన్ని రోజుల నుంచి కోల్డ్ వారైతే నడుస్తోంది.
వీళ్ళ మధ్య మాటలు లేవు ఏ ఫంక్షన్ జరిగినా కూడా వీళ్ళు మాత్రం ఆ ఫంక్షన్ కి అటెండ్ అవ్వడం లేదు. మరి ఎందుకని వీళ్ళ మధ్య అలాంటి క్లాశేష్ వచ్చాయి అనే విషయం క్లారిటీగా చెప్పలేకపోతున్నారు. కానీ మొత్తానికైతే వీళ్లు కలిసిపోతే చూడాలని నందమూరి అభిమానులైతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మరి వాళ్ళు కలుస్తారా? లేదా అనే విషయం తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ఇక కొద్దిరోజుల వరకు నందమూరి ఫ్యామిలీ హీరోలంతా కలిసి మెలిసి ఉండేవారు. కానీ ఈ మధ్య మాత్రం కొన్ని తేడాలు వచ్చాయి. దాంతో వీళ్ళ మధ్య మాటలు లేకుండా పోయాయి…
Also Read: ‘గేమ్ చేంజర్’ ని దాటేసిన ‘హిట్ 3’..ఓవర్సీస్ లో మాస్ ర్యాంపేజ్!