Prabhas : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మీడియం రేంజ్ హీరోలు సైతం వాళ్ళను వాళ్ళు స్టార్లు హీరోలుగా మార్చుకోవాల్సిన అవసరమైతే ఉంది…ఇక మీదట చేయబోయే ప్రతి సినిమా విషయంలో మన దర్శకులు హీరోలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరో ప్రభాస్ (Prabhas)…ఆయన చేసిన ప్రతి సినిమా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ప్రేక్షకుడి మెప్పించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెట్టాయి. ముఖ్యంగా బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియా హీరోగా మారిపోయిన ఆయన అప్పటి నుంచి ఇప్పటివరకు వెను తిరిగి చూడకుండా వరుస సక్సెస్ లతో ముందుకు దూసుకెళ్తున్నాడు. సలార్(Salaar), కల్కి (Kalki) లాంటి రెండు వరుస బ్లాక్ బాస్టర్ సక్సెస్ లను అందించిన ఆయన వచ్చే సంవత్సరం ఫౌజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ మధ్యలోనే ‘రాజాసాబ్ ‘ (Rajasaab) సినిమాను కూడా రిలీజ్ చేయాలనే ఉద్దేశం లో ఉన్నట్టుగా తెలుస్తోంది.
Also Read : ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కానున్నాయా..?
మరి ప్రభాస్ లాంటి నటుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఎందుకంటే ఆయన లాంటి కటౌట్, ఆయన లాంటి మాస్ ఇమేజ్ ని సంపాదించుకున్న హీరో మరెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక అలాంటి ప్రభాస్ భారీ సక్సెస్ లను సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నాడు.
చాలా రోజుల నుంచి ఆయన ఒక క్యారెక్టర్ చేస్తే చూడాలని తమ అభిమానులందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దేశభక్తికి సంబంధించిన సినిమాలో నటిస్తే ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ఫ్రీడమ్ ఫైటింగ్ సమయంలో ఒక ఫిక్షనల్ స్టోరీ ని తీసుకొని ప్రభాస్ ఇండియా కి స్వతంత్రాన్ని తీసుకురావడంలో తన పాత్ర ఎలా పోషించాడు? అనే ఒక కంటెంట్ తో సినిమా వస్తే అందులో ప్రభాస్ ని చూసి ఆనంది పడేలా తన అభిమానులు సైతం కోరుకుంటున్నారు.
ఇక ఇప్పటివరకు ప్రభాస్ దేశభక్తికి సంబంధించిన సినిమా అయితే చేయలేదు. మరి ఇప్పుడు కనక చేసినట్లయితే భారీగా వర్కౌట్ అవుతుంది అనే ఉద్దేశంతో కొంతమంది సినిమా మేకర్స్ సైతం ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ప్రభాస్ సైతం ఇలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడుతున్నప్పటికి ఆయన దగ్గరికి మాత్రం అలాంటి కథలు రావడం లేదని ఆయన పలు సందర్భాల్లో తెలియజేయడం విశేషం…ఇక ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న సినిమాలు నెక్స్ట్ లెవల్లో ఉండబోతున్నట్టుగా తెలుస్తున్నాయి.
Also Read : ప్రభాస్ తో సూపర్ మ్యాన్ సినిమా చేయడానికి స్క్రిప్ట్ రెడీ చేసిన సుకుమార్…