Game Changer and Hit 3 : మీడియం రేంజ్ లో హీరోలలో నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) ని ట్రేడ్ ఓవర్సీస్ కింగ్ అని పిలుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా ఆ ప్రాంతంలో ఇరగ కుమ్మేస్తున్నాయి కాబట్టి. కాస్త పెద్ద సినిమా తీస్తే ఈయన స్టామినా స్టార్ హీరోలకు ఏమాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. ఇప్పుడు ‘హిట్ 3′(Hit 3) ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ అక్కడి ట్రేడ్ ని ఆశ్చర్యానికి గురి చేసింది. కేవలం నార్త్ అమెరికా నుండి ఈ చిత్రానికి ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వచ్చిన గ్రాస్ 88 వేల డాలర్స్ ని దాటేసింది. సినిమా విడుదలకు ఇంకా వారం రోజులకు పైగా సమయం ఉంది, అయినప్పటికీ ఈ స్థాయి గ్రాస్ అంటే సాధారణమైన విషయం కాదు. అంతే కాదు ఈ సినిమా ఈ ఏడాది విడుదలైన ‘గేమ్ చేంజర్’ కంటే బెటర్ ట్రెండ్ చూపిస్తుందని అంటున్నారు ట్రేడ్ పండితులు.
Also Read : ‘గేమ్ చేంజర్’ టాప్..’సంక్రాంతికి వస్తున్నాం’ అవుట్..ఓటీటీలో విచిత్రమైన ఫలితాలు!
‘గేమ్ చేంజర్'(Game Changer) చిత్రానికి 20 రోజుల ముందు 220 లొకేషన్స్ లో 587 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించారు. ఈ షోస్ నుండి 2657 టికెట్స్ అమ్ముడుపోగా, 74 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక నాని ‘హిట్ 3’ విషయానికి వస్తే ఇప్పటి వరకు 184 లొకేషన్స్ లో 523 షోస్ కి అడ్వాన్స్ బుకింగ్స్ షెడ్యూల్ చేసారు. వీటి నుండి 4552 టికెట్స్ అమ్ముడుపోగా, 88 వేల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. గేమ్ చేంజర్ కంటే తక్కువ లొకేషన్స్, తక్కువ షోస్ ఉన్నప్పటికీ ఈ గ్రాస్ విషయం లో ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ ఉండడం సాధారణమైన విషయం కాదు. ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తే ప్రీమియర్ షోస్ నుండి గ్రాస్ ‘గేమ్ చేంజర్’ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది.
‘గేమ్ చేంజర్’ చిత్రానికి నార్త్ అమెరికా ప్రీమియర్ షోస్ నుండి 1 మిలియన్ గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే ‘హిట్ 3’ కి అంతకన్నా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని బట్టీ ఓవర్సీస్ లో నాని బ్రాండ్ ఇమేజ్ ఎలాంటిదో అందరూ అర్థం చేసుకోవచ్చు. ఈ చిత్రానికే ఈ రేంజ్ ఉంటే, భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’ చిత్రానికి ఏ రేంజ్ ఉంటుందో అని అభిమానులు ఇప్పటి నుండే అంచనా వేస్తున్నాడు. ఆ చిత్రం తో నాని ప్రీమియర్స్ విషయం లో స్టార్ హీరోలను కూడా దాటేస్తాడు అనుకోవచ్చు. ఆయన గత చిత్రం ‘సరిపోదా శనివారం’ ఫుల్ రన్ లో నార్త్ అమెరికా నుండి మూడు మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. నాని కి దరిదాపుల్లో మరో మీడియం రేంజ్ హీరో లేదు. చూడాలి మరి హిట్ 3 రేంజ్ ఎలా ఉండబోతుంది అనేది.
Also Read : హిట్ 3′ సూపర్ హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు రాబట్టలో తెలుసా..? నాని కి అగ్నిపరీక్ష!