Homeఎంటర్టైన్మెంట్Nagarjuna: ఏమి మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ నాగార్జున హాట్ కామెంట్స్..

Nagarjuna: ఏమి మాట్లాడాలన్నా భయం వేస్తోంది అంటూ నాగార్జున హాట్ కామెంట్స్..

Nagarjuna: అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నేడు ఏర్పాటు చేశారు మూవీ టీం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న అక్కినేని అఖిల్ , ఈ సినిమాతో ఎలా అయినా కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమో , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కి కూడా […]

Nagarjuna: అక్కినేని నాగార్జున నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ చిత్రం ‘లెనిన్’ మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించిన ప్రెస్ మీట్ ని నేడు ఏర్పాటు చేశారు మూవీ టీం. వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని ఎదురుకుంటున్న అక్కినేని అఖిల్ , ఈ సినిమాతో ఎలా అయినా కం బ్యాక్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ఈ చిత్రం అఖిల్ కి ఎంత ముఖ్యమో , హీరోయిన్ భాగ్యశ్రీ భొర్సే కి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే ఈమె కెరీర్ లో చేసిన సినిమాలన్నీ ఫ్లాపులే. ఇప్పుడు ఈ సినిమా కూడా ఫ్లాప్ అయితే ఆమె కెరీర్ కి ఇబ్బంది ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే వీళ్లిద్దరికీ ఈ సినిమా సక్సెస్ అత్యంత అవసరం. ఇకపోతే నేడు ప్రెస్ మీట్ లో నాగార్జున మీడియా గురించి మాట్లాడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.

ఆయన మాట్లాడుతూ ‘ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులను చూస్తుంటే నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆరోజుల్లో సినిమా ప్రొమోషన్స్ అంటే కేవలం ఆరుగురు జర్నలిస్టులు , ఒకే ఒక్క ఫోటోగ్రాఫర్ మాత్రమే ఉండేవారు. అప్పట్లో ఇప్పటి లాగా చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండేవి కాదు , నిరంతరం రికార్డింగ్ చేసే కెమెరాలు , డిజిటల్ రికార్డ్స్ వంటివి లేకపోవడం తో మాలో ఎలాంటి టెన్షన్ ఉండేది కాదు. హాయిగా ప్రొమోషన్స్ , ప్రెస్ మీట్స్ వంటివి పెట్టుకొని వెళ్ళేవాళ్ళం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ఎక్కడ ఏ కెమెరాలు పెడుతారో , ఎవరు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు , మేము చెప్పే సమాధానాలను ఎలా వక్రీకరించి చూపిస్తారో అని భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రెస్ మీట్ అంటేనే వణుకు పుట్టే పరిస్థితి’ అంటూ నాగార్జున ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

ఇక ‘లెనిన్’ విషయానికి వస్తే , ఈ సినిమా పై అక్కినేని ఫ్యాన్స్ కోటి ఆశలు పెట్టుకున్నారు. నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి వచ్చిన కుర్ర హీరోలు కూడా భారీ హిట్స్ ని అందుకొని , మార్కెట్ లో తమకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని ఏర్పాటు చేసుకుంటున్నారు. కానీ అఖిల్ మాత్రం ఎక్కడ మొదలెట్టాడో , అక్కడే ఆగిపోయాడు , ఆయన కెరీర్ పూర్తిగా డైలమాలో పడిపోయింది. అందుకే లెనిన్ తో ఎలా అయినా హిట్ కొట్టి తన సత్తా చాటాలని అనుకుంటున్నారు. ఇక నాగార్జున కూడా తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలను పక్కన పెట్టి , కేవలం ‘లెనిన్’ మీదనే ఫోకస్ పెట్టారు. ఈ సినిమా ఔట్పుట్ పై ఆయన చాలా నమ్మకం తో ఉన్నారు. మరి ఆ నమ్మకం ఎంత వరకు నిజం అవుతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper