spot_img
Homeఎంటర్టైన్మెంట్Saya Saya Song: రొమాంటిక్‌ ‘సయా’.. ఊహించిన దానికంటే బాగుంటుందట !

Saya Saya Song: రొమాంటిక్‌ ‘సయా’.. ఊహించిన దానికంటే బాగుంటుందట !

Saya Saya Song: కూల్ అండ్ క్లాస్ హీరో నాగశౌర్య హీరోగా రాబోతున్న కొత్త సినిమా ‘లక్ష్య’. విలువిద్య నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమాలో బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్‌ తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా బలంగా ఉంటాయట. అయితే, తాజాగా ఈ సినిమాలోని సయా సయా అంటూ సాగే క్రేజీ సాంగ్ ను యంగ్‌ హీరో, అక్కినేని వారసుడు నాగ చైతన్య రిలీజ్ చేశాడు. ఈ ‘సయా’ రొమాంటిక్‌ లిరికల్‌ సాంగ్‌ ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటుంది.

Lakshya Movie
Lakshya Movie

సాంగ్ లో లిరిక్స్ తో పాటు నాగశౌర్య – కేతిక శర్మ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. ప్రేమలో మునిగి తేలిన ప్రేమికుల మధ్య ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి అనే కోణంలో మొదలైన ఈ పాటలో కథలోని సందర్భాలను, అలాగే ప్రధాన పాత్రల తాలూకు లవ్ ట్రాక్ ను ఎలివేట్ చేశారు. ఇక కృష్ణకాంత్‌ ఈ పాటకు అందించిన సాహిత్యం కూడా చాలా బాగుంది.

సరళమైన పదాలలో అర్ధవంతమైన భావాలను అద్ది, చక్కని పల్లవి చరణాలను రాశాడు. ఎమ్‌ఎమ్‌ కిరవాణి వారసుడు కాల భైరవా ఈ పాట కోసం సమకూర్చిన స్వరాలు కూడా చాలా బాగున్నాయి. డిసెంబర్‌ 10న థియేటర్లోకి రాబోతోన్న ఈ సినిమాలో కంటెంట్ చాలా బాగుంటుందని, ముఖ్యంగా సాంగ్స్ కూడా చాలా బాగుంటాయని తెలుస్తోంది.

ఎలాగూ ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్‌ కూడా బాగా ఆకట్టుకుంది. సినిమా పై అంచనాలను భారీగా పెంచింది. పైగా ఈ మధ్య కాలంలో తెలుగులో స్పోర్ట్స్‌ నేపథ్యంలో సినిమా రాలేదు. అందుకే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ట్రైలర్‌ కూడా బాగుండటంతో మరింత హైప్‌ క్రియేట్‌ అయింది.

Also Read: RRR Movie: “ఆర్‌ఆర్‌ఆర్” ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్… పూనకాలకు రెడీ గా ఉండండి అంటూ

మరోపక్క మేకర్స్ కూడా ఈ సినిమా ఊహించిన దానికంటే మరో లెవల్‌లో ఉండబోతుందని చెబుతున్నారు. కొత్త దర్శకుడు సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, సచిన్ కేడ్కర్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నారాయణ దాస్ నారంగ్.. రామ్మోహన్ రావు.. శరత్ మరార్ ఈ సినిమాకి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Also Read: Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper