Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

Actress Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన ఖాతాలో మరో అరుదైన ఘనతను సాధించింది. 2021 సంవత్సరం సామ్ జీవితంలో ఒక మరపురాని మైలు రాయిగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. పలు కారణాల వల్ల సమంత ఈ ఏడాది మొత్తం మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూనే ఉంది. ఆ మేరకు తాజాగా మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా ఇండియాలోనే టాప్ 10 లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. మొదటిసారిగా యాహూ ఇండియాలో ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ […]

Actress Samantha: మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా సమంత … టాప్ 10 లిస్ట్ చోటు కైవసం

Actress Samantha: స్టార్ హీరోయిన్ సమంత తన ఖాతాలో మరో అరుదైన ఘనతను సాధించింది. 2021 సంవత్సరం సామ్ జీవితంలో ఒక మరపురాని మైలు రాయిగా మిగిలిపోతుందని చెప్పొచ్చు. పలు కారణాల వల్ల సమంత ఈ ఏడాది మొత్తం మీడియాలో హాట్ టాపిక్ గా ఉంటూనే ఉంది. ఆ మేరకు తాజాగా మోస్ట్ సెర్చ్డ్ ఫిమేల్ సెలబ్రిటీగా ఇండియాలోనే టాప్ 10 లిస్ట్ లో స్థానం దక్కించుకుంది. మొదటిసారిగా యాహూ ఇండియాలో ఈ సంవత్సరం అత్యధికంగా సెర్చ్ చేసిన సెలెబ్రిటీల జాబితాలోకి సామ్ ప్రవేశించింది.

actress samantha got place in most searched female cebebrity for this year

ఈ జాబితాలో 10వ స్థానంలో నిలిచింది ఈ భామ. ఇందుకు గల కారణాలను పరిశీలిస్తే… సామ్ జామ్‌తో హోస్ట్‌గా ఓటిటి రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ… ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇక వ్యక్తిగతంగా భర్త నాగ చైతన్యతో విడిపోతున్నట్లు ప్రకటించడం మరో సంచలనానికి తెరలేపింది.

ఆమె ప్రకటన వెలువడిన దగ్గరి నుంచి మీడియా అటెన్షన్ అంతా సమంత మీదే ఉంది అనడంలో తప్పేమీ లేదు. ఆ వార్తతో ఆమె అభిమానులు కూడా ఆందోళనకు గురయ్యారు. ఇక ప్రస్తుతం అల్లు అర్జున్ రాబోయే పాన్ ఇండియన్ మూవీలో సామ్ స్పెషల్ సాంగ్ చేయడానికి ఒప్పుకోవడం… హాలీవుడ్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. దివంగత నటుడు సిద్ధార్థ్ శుక్లా యాహూ జాబితా ప్రకారం అత్యధికంగా సెర్చ్ చేసిన మేల్ సెలబ్రిటీగా నిలిచాడు. తరువాత స్థానాల్లో సల్మాన్ ఖాన్ , అల్లు అర్జున్ ఉన్నారు. అల్లు అర్జున్ టాప్ 3 లో ఉండడం పట్ల ఆయన అభిమానులంతా ఈ వార్తను షేర్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్ట్ లు చేస్తున్నారు.

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు