spot_img
Homeఎంటర్టైన్మెంట్నిహారికను దెయ్యంతో పోల్చిన నాగబాబు !

నిహారికను దెయ్యంతో పోల్చిన నాగబాబు !


నేడు డాటర్స్ డే.. అంటే కూతుళ్ల దినోత్సవం. కూతుళ్ల పై ప్రేమానురాగాలను కురిపించడానికి ఇంగ్లీషోళ్ళు పెట్టుకున్న రోజు ఇది. అయితే కూతుళ్ల దినోత్సవాన్ని ప్రతి ఆడపిల్ల తండ్రి జరుపుకోవాలి. అసలు అమ్మాయి పుట్టిందంటే పెదవి విరుపులు విరిచే కాలం నుండి.. మా ఇంటి మహాలక్ష్మి అనే రోజుల్లోకి కూతుళ్ళు వచ్చేశారు. మారిన పరిస్థితులు నేపధ్యంలో.. ఇప్పుడు మాకు ఆడపిల్లనే కావాలి అని తల్లిదండ్రులు ఆశ పడేంతగా రోజులు మారిపోయాయి. అంతలా ఆడపిల్లల పై జనంలో చైతన్యం వచ్చింది. మరి ప్రస్తుతం కొడుకులే గుదిబండగా మారుతున్న తరుణంలో తల్లిదండ్రులు ఆడపిల్లల్ని ఇంటి దీపాలుగా భావించడంలో ఆశ్చర్యం ఏముంది. అందుకే ప్రతి తండ్రి తన కూతురు పై ఎంతో ప్రేమను కురిపిస్తూ ఉంటాడు.

Also Read: కేకలు పెట్టిన పాయల్‌ రాజ్‌పుత్‌..

కాగా ఈ డాటర్స్ డే సందర్భంగా నాగబాబు కూడా తన కూతురు నిహారిక గురించి, ఆమె మీద తన ప్రేమ గురించి తన శైలిలో చెప్పుకొచ్చాడు. ఈ మెగా బ్రదర్‌కి తన కూతురు నిహారిక అంటే పంచ ప్రాణాలు అట. నాగబాబు తన కూతురు మీదున్న ప్రేమ గురించి అలాగే కూతుళ్ళు గురించి చెబుతూ.. ‘మనం కలలు కనే చిట్టి దెయ్యాల రూపంలో కూతుళ్ళు ఈ భూమ్మీదకు వస్తారు. మనల్ని నవ్వించేందుకు, మనల్ని ఏడిపించేందుకు, మనల్ని ఆట పట్టించేందుకు, చివరకు మనకు చిరాకు పుట్టించేందుకు, అన్నిటికీ మించి మనల్ని ప్రేమలో పడేసేందుకు.. ఈ కూతుళ్ళు మన కోసం వస్తారు. వారి పిచ్చిని మనం ప్రతీ రోజూ సెలెబ్రేట్ చేసినా సరిపోదు. హ్యాపీ డాటర్స్ డే టు మై డ్రీమ్ డెవిల్ అని నిహారికకు విష్ చేసి… అలాగే ఈ భూమ్మీద ఉన్న ప్రతీ దెయ్యానికి కూడా డాటర్స్ డే శుభాకాంక్షలు అని మొత్తానికి నాగబాబు కూతుళ్ల దినోత్సవాన్ని తన శైలిలో సెలెబ్రేట్ చేశాడు.

Also Read: అంతులేని సంతోషం.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్ !

ఇక మెగా డాటర్ నిహారిక గుంటూరుకి చెందిన జొన్నలగడ్డ చైతన్యను వివాహం చేసుకోనున్న సంగతి తెలిసిందే. జొన్నలగడ్డ చైతన్య గుంటూరు ఐజీ ప్రభాకరరావు కుమారుడు. ఆ మధ్య తన వియ్యంకుడు ఐజీ రిటైర్మెంట్ సందర్భంగా అయన గురించి ఎంతో గొప్పగా మాట్లాడాడు నాగబాబు. ఇరు కుటుంబాల పెద్దలు ఈ పెళ్లిని నిశ్చయించారు. కొద్దిరోజులుగా నిహారిక తనకు కాబోయేవాడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ సందడి చేస్తుంది. ఇక నిహారిక తనను వదిలి వెళ్లిపోనుందని నాగబాబు బాగానే ఫీలవుతున్నట్టు కనిపిస్తోంది.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

R Madhavan

R Madhavan: హీరో మాధవన్ అదృశ్యం.. విద్యార్థుల గాలింపు.. అసలు ఏమి జరిగిందంటే..

R Madhavan: ఢిల్లీ లోని పార్లమెంట్ ఆవరణలో గత కొద్దీ రోజుల నుండి కాక్రోచ్ పార్టీ ఆద్వర్యం లో జరుగుతున్న విద్యార్థుల నిరసన కార్యక్రమాలు ఏ రేంజ్ లో జరుగుతున్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం...
Jaya Krishna Ghattamaneni

Jaya Krishna Ghattamaneni: బయట హీరోల్లో ఆ స్టార్ హీరో కి వీరాభిమాని అంటూ ఘట్టమనేని జయకృష్ణ హాట్...

Jaya Krishna Ghattamaneni: సూపర్ స్టార్ కృష్ణ రెండవ తనయుడు , మహేష్ బాబు సోదరుడు , రమేష్ బాబు కుమారుడిగా జయ కృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీ లోకి హీరో గా...

NEET Controversy : విద్యార్థుల ఆవేదనలో అర్ధముంది మరి రాజకీయ నాయకుల ఆందోళనలో?

NEET Controversy : దేవాలయాల లాంటి విద్యాసంస్థల్లో ప్రవేశం కోసం, తమ భవిష్యత్తును దిద్దుకోవడం కోసం రాత్రింబవళ్లు కష్టపడే కోట్లాది మంది విద్యార్థుల నిరీక్షణను నీరుగార్చేలా ఇటీవల విద్యావ్యవస్థలో వరుసగా జరుగుతున్న పరిణామాలు...
Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎన్ని కోట్ల గ్రాస్ రాబట్టాలో తెలుసా..?...

Chennai Love Story: సినిమా సినిమాకు తన పరిధి ని పెంచుకుంటూ , యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం. ఈయన కెరీర్...
Trisha Krishnan

Trisha Krishnan: ‘జన నాయగన్’ థియేటర్ లో త్రిష.. మీడియా ని చూడగానే పరుగులు.. వీడియో వైరల్..

Trisha Krishnan: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డిజాస్టర్ టాక్...
Oktelugu Epaper