Homeఎంటర్టైన్మెంట్ప్చ్.. 'రాజు'గారి మనసంతా బూతు మయమే !

ప్చ్.. ‘రాజు’గారి మనసంతా బూతు మయమే !

Dirty Hari

ఏమిటి రాజు గారికి ఏమైంది ? పెద్దరికం వచ్చాక ఆయన మనసు మొత్తం బూతు మయం అయిపోయిందేమిటి ? ఒకప్పుడు ఎం.ఎస్.రాజు అంటేనే మంచి సినిమాలకు కేరాఫ్ అడ్రస్. అందుకే, యావత్తు తెలుగు సినీ జనం ఆయనను ఎంతో గౌరవంగా చూసేవారు. అసలు ఎం.ఎస్ రాజు అంటేనే భారీ సినిమాలు, అలాగే ఆయన ఆలోచనల శైలి కూడా అంతా భారీ తనం. కానీ రోజులు మారాయి, ఆయన ప్రభ, వైభవం అంతా గతం అయిపోయింది.

వర్తమానం రాజుగారు బూతు సినిమాలు చేసుకుంటూ నాలుగు రాళ్లు సంపాదించుకోవడానికి నానాకష్టాలు పడుతున్నారు. ఏది ఏమైనా ఒక భారీ నిర్మాత, దర్శకుడిగా మారి ‘డర్టీ హరి’ అనే బూతు సినిమా తీసి హిట్ కొట్టడంతో రాజుగారికి డైరెక్టర్ గా మరో సినిమా వచ్చింది. నిజానికి ‘డర్టీ హరి’ కేవలం బోల్డ్ నెస్ తోనే హిట్ అయింది.

ప్రతి మనిషిలోనూ అంతర్గతంగా ఇంకొక మనిషి దాగి ఉంటాడనే కాన్సెప్ట్ తో సాగిన ఆ సినిమా నిండా బూతులు, బోల్డ్ సీన్స్ మాత్రమే ఉన్నాయి. ఇవి ఉన్నాయనే సినిమా హిట్ అయిందనే అపోహలో రాజుగారు ఉన్నారేమో, ఆయన మళ్ళీ బూతు సినిమాకి శ్రీకారం చుట్టారు. అయినా సినిమాలో మెయిన్ పాయింట్ ఉంటేనే హిట్ అవుతుంది కానీ,

ఓన్లీ, కిస్ లు హగ్ ల వల్ల సినిమా హిట్ అవ్వదు. కానీ, రాజుగారు మాత్రం హద్దులు మీరిన సన్నివేశాలతో దర్శకుడిగా అవసరానికి మించి మాస్ మసాలా సన్నివేశాలను రాసుకుని సినిమాలు తీసుకుంటూ పోవాలని గట్టిగానే ప్లాన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన ‘7 డేస్ 6 నైట్స్’ అనే టైటిల్ తో మరో బోల్డ్ సినిమా చేస్తున్నాడు. జూన్ 7న ఈ చిత్రం చిత్రీకరణను కూడా ప్రారంభించనున్నాడు. మరి రాజుగారు ‘7 డేస్ లో 6 నైట్స్’గా ఏమి చూపిస్తారో చూడాలి.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...
Modi Gen Z Video

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...
Trump Warning Iran Deal

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...
KTR And Harish Rao In Bigg Boss

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper