Balakrishna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఆయన చేస్తున్న ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించడమే కాకుండా కమర్షియల్ సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే బాలయ్య బాబు నుంచి రీసెంట్ గా వచ్చిన అఖండ 2 సినిమా పెను ప్రభంజనాన్ని క్రియేట్ చేసింది. సక్సెస్ ఫుల్ టాక్ తో ముందుకు దూసుకెళ్తున్న ఈ సినిమా లాంగ్ రన్ లో ఎంతటి కలెక్షన్ ను కొల్లగొడుతోంది అనేది తెలియాల్సి ఉంది… బాలయ్య బాబు తన కొడుకు అయిన మోక్షజ్ఞను ఇండస్ట్రీకి పరిచయం చేయాలని గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్న విషయం మనకు తెలిసిందే. 2025వ సంవత్సరంలో ఆయన ఇండస్ట్రీకి పరిచయమవుతాడు అంటూ గతంలో కొన్ని వార్తలు వచ్చినప్పటికి అవేవీ కార్యరూపం దాల్చలేదు. 2025 కూడా పూర్తి కావడానికి వచ్చింది. ఇక 2026వ సంవత్సరంలో అయిన మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా అనే దాని మీదనే ఇప్పుడు తీవ్రమైన ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పుడప్పుడే మోక్షజ్ఞ ఎంట్రీ ఉండేవిధంగా కనిపించడం లేదు.
మోక్షజ్ఞ సైతం సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తి చూపించడం లేదని అందువల్లే బాలయ్య కూడా లైట్ తీసుకున్నాడనే వార్తలైతే వస్తున్నాయి… ప్రస్తుతం మోక్షజ్ఞ వయసు 30 సంవత్సరాల పైనే ఉంటుంది. కాబట్టి బాలయ్య బాబు మోక్షజ్ఞని 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే బాగుండేది.
అప్పుడైతే మోక్షజ్ఞ కి సైతం ఏదో ఒకటి చేయాలి రాణించాలనే సంకల్పం ఉండేది. కానీ ఇప్పుడు అలాంటిది ఏదీ లేకుండా పోయింది. సినిమాలంటే మొదటి నుంచి తనకి ఇంట్రెస్ట్ ఉన్నప్పటికి తను నటించడానికి మాత్రం పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఈ విషయంలో బాలయ్య బాబు రాంగ్ స్టెప్ వేశారనే చెప్పాలి.
చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు వాళ్ళ వారసులను 20 సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీకి తీసుకురావడంతో ఇప్పుడు వాళ్ళు టాప్ హీరోలుగా ముందుకు సాగుతున్నారు. ఒకవేళ మోక్షజ్ఞ ఇప్పుడు ఇండస్ట్రీకి వచ్చిన అతను టాప్ హీరోగా మారడానికి మరో నాలుగు ఐదు సంవత్సరాల సమయం పట్టే అవకాశాలైతే ఉన్నాయి… కాబట్టి తను ఇక ఇండస్ట్రీకి రాకపోవడమే ఉత్తమం అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…