Mohan Babu
Mohan Babu : 2004 ఏప్రిల్ 17న నటి సౌందర్య మరణించింది. ఆమె ప్రయాణిస్తున్న ఫ్లైట్ కుప్పకూలడంతో సోదరుడు అమర్నాథ్ తో పాటు సౌందర్య కన్నుమూశారు. ఈ ప్రమాదం జరిగి రెండు దశాబ్దాలు దాటిపోయింది. అయితే సౌందర్యను ప్రణాళిక ప్రకారం నటుడు మోహన్ బాబు హత్య చేశాడంటూ ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఖమ్మం జిల్లా ఏఎస్పీ, కలెక్టర్ లకు తన ఫిర్యాదు అందజేశాడు. తన ఫిర్యాదులో కీలక ఆరోపణలు చేశాడు.
జుల్పల్లిలో నటి సౌందర్య 6 ఎకరాల స్థలం కొన్నది. దాని విలువ విపరీతంగా పెరగడంతో మోహన్ బాబు తనకు అమ్మాలని సౌందర్యను కోరాడు. అందుకు ఆమె నిరాకరించింది. సౌందర్య సోదరుడు అమర్నాథ్ లో మాట్లాడినా ఫలితం దక్కలేదు. దాంతో సాక్ష్యాలు లేకుండా సౌందర్య, అమర్నాథ్ లను మోహన్ బాబు హత్య చేశారు. సౌందర్య స్థలాన్ని మోహన్ బాబు స్వాధీనం చేసుకున్నాడు. పోలీసులు దీనిపై విచారణ జరిపి జల్పల్లి లో గల మోహన్ బాబు ఫార్మ్ హౌస్ ని అనాథ శరణాలయం, ఆర్మీ లేదా పోలీస్ సిబ్బంది, లేదా మీడియా మిత్రులకు ఇవ్వాలి.
Also Read : మోహన్ బాబు వల్లే మంచు విష్ణు సినిమా పోయింది, మీరు చేసింది తప్పు అన్నాను… స్టార్ రైటర్ కీలక కామెంట్స్!
మోహన్ బాబు చిన్న కుమారుడు మనోజ్ కి తన ఆస్తి వాటా వచ్చేలా చేయండి. మోహన్ బాబు నుండి నాకు ప్రాణహాని ఉంది.. అంటూ ఫిర్యాదులో చిట్టిమల్లు రాసుకొచ్చాడు. ప్రస్తుతం మోహన్ బాబు-మనోజ్ తీవ్ర వివాదం నడుస్తుంది. జుల్పల్లి ఫార్మ్ హౌస్ కోసమే ఈ గొడవలు అనే వాదన ఉంది. ఈ క్రమంలో అది సౌందర్య ఆస్తి అంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. ఇది పబ్లిసిటీ స్టంటా లేక మనోజ్ ఇలా చేయించాడా? అనే సందేహాలు మొదలయ్యాయి. కాగా మోహన్ బాబు-సౌందర్య పలు చిత్రాల్లో కలిసి నటించారు.
వీరి కాంబోలో వచ్చిన పెదరాయుడు ఇండస్ట్రీ హిట్. సౌందర్య చివరి చిత్రం శివ శంకర్ మోహన్ బాబుదే కావడం విశేషం. ఈ సినిమా షూటింగ్ దశలో ఉండగా సౌందర్య ప్రమాదంలో మరణించింది. ప్రస్తుతం మోహన్ బాబు కన్నప్ప మూవీ పనుల్లో బిజీగా ఉన్నాడు. విష్ణు హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఏప్రిల్ 25న విడుదల కానుంది. కన్నప్ప మూవీలో మోహన్ బాబు ఓ కీలక రోల్ చేశాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ గెస్ట్ రోల్స్ చేస్తున్నారు.
Also Read : నెంబర్ వన్ హీరో చిరంజీవికి మోహన్ బాబు ఝలక్.. పోటీగా మూవీ విడుదల చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన కలెక్షన్ కింగ్
Web Title: Mohan babu sensational allegations beauty case
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com