Chiranjeevi-Mohan Babu : మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ఆరంభంలో విలన్, సపోర్టింగ్ రోల్స్ చేశాడు. హీరోగా ఎదిగాక ఆయనకు తిరుగులేకుండా పోయింది. నటన, డాన్సులలో ట్రెండ్ సెట్ చేసిన చిరంజీవి టాలీవుడ్ నెంబర్ వన్ హీరో అయ్యాడు. మరోవైపు మోహన్ బాబు విలన్ రోల్స్ తో ఫేమస్ అయ్యాడు. చిరంజీవి హీరోగా తెరకెక్కిన అనేక చిత్రాల్లో ఆయన విలన్ రోల్స్ చేశాడు. అప్పుడప్పుడు హీరోగా ప్రయత్నం చేస్తూ ఉండేవాడు. అసెంబ్లీ రౌడీ హిట్ అయ్యాక మోహన్ బాబు విలన్ రోల్స్ చేయడం ఆపేశాడు. అప్పటి వరకు ఒప్పుకున్న చిత్రాలు చేసి హీరోగా బిజీ అయ్యాడు.
also Read : పవన్ కళ్యాణ్ సినిమా కోసం చిరంజీవి మరో త్యాగం..అభిమానులకు ఆనందపడాలో, బాధపడాలో తెలియని పరిస్థితి!
కాగా టాప్ హీరోగా ఉన్న చిరంజీవికి ఝలక్ ఇస్తూ మోహన్ బాబు.. ఆయనకు పోటీగా మూవీ విడుదల చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. చిరంజీవి-మోహన్ బాబు నటించిన చిత్రాలు ఒకే రోజు విడుదలయ్యాయి. చిరంజీవి మూవీ ప్లాప్ కాగా… మోహన్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ నమోదు చేశాడు. అవి బిగ్ బాస్, పెదరాయుడు చిత్రాలు. తమిళ హిట్ మూవీ నట్టమై తెలుగు రీమేక్ రైట్స్ మోహన్ బాబు తీసుకున్నారు. కే ఎస్ రవికుమార్ ఒరిజినల్ కి దర్శకత్వం వహించాడు. శరత్ కుమార్, మీనా, కుష్బూ ప్రధాన పాత్రలు చేశాడు. తెలుగులో రవిరాజా పినిశెట్టి పెదరాయుడుగా రీమేక్ చేశాడు.
రజినీకాంత్ గెస్ట్ రోల్ చేయగా, ఆ పాత్ర సినిమాకు వెన్నెముకలా నిలిచింది. మరోవైపు బాపినీడు దర్శకత్వంలో చిరంజీవి బిగ్ బాస్ చేశాడు. రోజా హీరోయిన్ గా నటించింది. 1995 జూన్ 15న పెదరాయుడు-బిగ్ బాస్ విడుదలయ్యాయి. రెండు చిత్రాలకు హిట్ టాక్ రాలేదు. అయితే పెదరాయుడు మెల్లగా పుంజుకుంది. ఆడియన్స్ పెదరాయుడు ఆడుతున్న థియేటర్స్ క్యూ కట్టడం స్టార్ట్ చేశారు. యావరేజ్ టాక్ నుండి ఇండస్ట్రీ హిట్ రేంజ్ కి పెదరాయుడు వెళ్ళింది. కనక వర్షం కురిపించింది.
మోహన్ బాబు స్వయంగా నిర్మించాడు. పెదరాయుడు మూవీలోని సాంగ్స్, డైలాగ్స్ కూడా బాగా ఫేమస్ అయ్యాయి. హీరోగా మోహన్ బాబు చిరస్మరణీయమైన విజయం అందుకున్నాడు. అదే సమయంలో చిరంజీవి నటించిన బిగ్ బాస్ మాత్రం నిరాశపరిచింది. ప్లాప్ గా మిగిలిపోయింది. టాప్ స్టార్ మూవీకి పోటీగా విడుదలైన విలన్ మోహన్ బాబు అంత పెద్ద హిట్ కొట్టడం విశేషంగా మారింది.
Also Read : 3 రోజుల్లో 1,80,000 టిక్కెట్లు..’చావా’ తెలుగు వెర్షన్ కి కాసుల కనకవర్షం..గ్రాస్ ఏ రేంజ్ లో వచ్చిందంటే!