Homeఎంటర్టైన్మెంట్Srikanth Odela: షాకింగ్..' ది పారడైజ్' తర్వాత రాజమౌళికి అసిస్టెంట్ గా చేరబోతున్న శ్రీకాంత్...

Srikanth Odela: షాకింగ్..’ ది పారడైజ్’ తర్వాత రాజమౌళికి అసిస్టెంట్ గా చేరబోతున్న శ్రీకాంత్ ఓదెలా!

Srikanth Odela: మన టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్ హవా నడుస్తోంది. పాత డైరెక్టర్స్ బాగా అవుట్ డేటెడ్ అయిపోవడం తో మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు కొత్త డైరెక్టర్స్ వెంట పడుతున్నారు. అలా కొత్త డైరెక్టర్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ వద్ద ఒకప్పుడు అసిస్టెంట్ గా పని చేసిన ఈయన, దసరా చిత్రం తో వెండితెర […]

Srikanth Odela: మన టాలీవుడ్ లో ప్రస్తుతం కొత్త డైరెక్టర్స్ హవా నడుస్తోంది. పాత డైరెక్టర్స్ బాగా అవుట్ డేటెడ్ అయిపోవడం తో మీడియం రేంజ్ హీరోల దగ్గర నుండి, స్టార్ హీరోల వరకు ప్రతీ ఒక్కరు కొత్త డైరెక్టర్స్ వెంట పడుతున్నారు. అలా కొత్త డైరెక్టర్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న వారిలో ఒకరు శ్రీకాంత్ ఓదెల. సుకుమార్ వద్ద ఒకప్పుడు అసిస్టెంట్ గా పని చేసిన ఈయన, దసరా చిత్రం తో వెండితెర డైరెక్టర్ గా వెండితెర అరంగేట్రం చేసాడు. ఈ సినిమా కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. నాని కెరీర్ లో ఇప్పటికీ ఇదే హైయెస్ట్ గ్రాసర్. అలాంటి సినిమా నాని మరోసారి శ్రీకాంత్ ఓదెల తో కలిసి ‘ది ప్యారడైజ్’ చిత్రం చేసాడు.

ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో ఈ చిత్రం విడుదల అవ్వబోతున్న సందర్భంగా , ఈ చిత్రానికి సంబంధించి నిన్న ఒక ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసాడు. ఈ ప్రెస్ మీట్ ని బాగా గమనిస్తే, నాని శ్రీకాంత్ ఓదెల పని తీరు పట్ల సంతృప్తి చెందలేదంటూ ఇన్ని రోజులు ప్రచారమైన వార్త నిజమేనేమో అని అనిపిస్తోంది. శ్రీకాంత్ ఓదెల నిన్న మాట్లాడుతూ ‘నాకు టైం ని మ్యానేజ్ చేయడం రాలేదు. ఈ సినిమా ఇంత ఆలస్యం అవ్వడానికి కారణం ఇదే. ఒక రోజు నేను నాని అన్నతో మాట్లాడుతూ , టైం మ్యానేజ్మెంట్ కోసం రాజమౌళి గారి దగ్గర నన్ను అసిస్టెంట్ గా చేర్చండి, నేను నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి అని అడిగాను’ అంటూ చెప్పుకొచ్చాడు శ్రీకాంత్ ఓదెల. గతం లో రీ షూట్స్ చేయడం పై , ఓవర్ బడ్జెట్ అయిపోతుంది అనే విషయం పై నాని శ్రీకాంత్ ఓదెల పై ఫైర్ అయ్యాడు అనే వార్త సోషల్ మీడియా లో పెద్ద దుమారమే రేపింది.

నిన్న శ్రీకాంత్ మాట్లాడిన మాటలు చూస్తుంటే అది నిజమే అని నూటికి నూరు శాతం స్పష్టమైంది. అంతే కాదు , సమయం లేకపోవడం వల్ల , చాలా వర్క్ పెండింగ్ ఉండడం తో ట్రైలర్ ని కూడా విడుదల చేయలేకపోతున్నాం అని నిన్నటి ప్రెస్ మీట్ లో నాని చెప్పుకొచ్చాడు. మరి సినిమా ఔట్పుట్ అయినా అభిమానుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది తెలియాలంటే మరో 12 రోజులు ఆగాల్సిందే. ఈ సినిమా హిట్ అయితే శ్రీకాంత్ రేంజ్ ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్తుంది. ఒకవేళ ఫ్లాప్ అయితే మాత్రం అదృశ్యం అయిపోతాడు , అందులో ఎలాంటి సందేహం లేదు , చూడాలి మరి ఆయన జాతకం ఎలా ఉండబోతుంది అనేది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper