Homeఎంటర్టైన్మెంట్Mega Heroes Comeback: 9 నెలల్లో 900 కోట్లు.. చరిత్ర తిరగరాసిన మెగా హీరోలు.. కం...

Mega Heroes Comeback: 9 నెలల్లో 900 కోట్లు.. చరిత్ర తిరగరాసిన మెగా హీరోలు.. కం బ్యాక్ అదుర్స్..

Mega Heroes Comeback: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడం మెగా ఫ్యామిలీ కి కొత్తేమి కాదు. భోళా శంకర్ , గేమ్ చేంజర్ , బ్రో , హరి హర వీరమల్లు , ఇలా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మెగా ఫ్యాన్స్ ని టార్చర్ చేశారు ఈ ముగ్గురు మెగా హీరోలు. ఇలాంటి సినిమాలు తీయడం కంటే , ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా […]

Mega Heroes Comeback: వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తర్వాత అభిమానులకు పూనకాలు రప్పించే రేంజ్ లో కం బ్యాక్ ఇవ్వడం మెగా ఫ్యామిలీ కి కొత్తేమి కాదు. భోళా శంకర్ , గేమ్ చేంజర్ , బ్రో , హరి హర వీరమల్లు , ఇలా వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ తో మెగా ఫ్యాన్స్ ని టార్చర్ చేశారు ఈ ముగ్గురు మెగా హీరోలు. ఇలాంటి సినిమాలు తీయడం కంటే , ముగ్గురు రిటైర్మెంట్ ఇచ్చేస్తే ప్రశాంతంగా ఉంటాం కదా అని సోషల్ మీడియా లో ట్వీట్లు కూడా వేసేవారు. అలాంటి సమయం లో ‘ఓజీ’ చిత్రం నుండి మెగా ఫ్యామిలీ కి గోల్డెన్ డేస్ మొదలయ్యాయి. భారీ అంచనాల నడుమ విడుదలైన ‘ఓజీ’ చిత్రానికి , ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ వచ్చింది , సెకండ్ హాఫ్ అసలు బాలేదంటూ కామెంట్స్ చేశారు.

కానీ సినిమాకు విపరీతమైన క్రేజ్ ఉండడం వల్ల, ఆ డివైడ్ టాక్ వచ్చినప్పటికీ కూడా 320 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ సృష్టించింది. హిందీ వెర్షన్ లో ఈ చిత్రం నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్ లో విడుదల కాలేదు , లేదంటే 400 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ఉండేది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా ఓపెనింగ్స్ లో మెగా ఫ్యాన్స్ మరోసారి గర్వంగా కాలర్ ఎగరేసుకునేలా చేసింది ఈ చిత్రం. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది , ఓవర్సీస్ లో ఏకంగా 5 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లను ప్రీమియర్స్ నుండి రాబట్టి , సెన్సేషన్ సృష్టించింది. ఈ సినిమా విడుదలైన మూడు నెలలకే మెగాస్టార్ చిరంజీవి కూడా గ్రాండ్ కం బ్యాక్ ఇచ్చాడు. ఆయన హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు ‘ సంక్రాంతి కానుకగా విడుదలై 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

ప్రాంతీయ బాషా చిత్రాల విభాగం లో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా కూడా నిల్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘పెద్ది’ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మొదట రోజు మొదటి ఆట నుండే బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. ఆ టాక్ కి తగ్గట్టుగానే ఓపెనింగ్ వసూళ్లు అదిరిపోయాయి , ప్రపంచవ్యాప్తంగా 270 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను కేవలం 6 రోజుల్లోనే రాబట్టింది. ఫుల్ రన్ లో ఈ చిత్రం కచ్చితంగా 350 కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు. అంటే కేవలం 9 నెలల్లోనే 900 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు మెగా హీరోల సినిమాల నుండి వచ్చాయి అన్నమాట. ఈ కం బ్యాక్ మెగా ఫ్యాన్స్ కి ఎక్కడలేని ఊపు ని తీసుకొచ్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper