Allu Arjun vs NTR: తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య తీవ్రమైన పోటీ ఉందనే విషయం మనందరికి తెలిసిందే. పర్సనల్ విషయాల్లో వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఉన్నప్పటికి సినిమాల విషయంలో మాత్రం ఒకరితో ఒకరు భారీగా పోటీపడుతున్నారు. అందువల్లే చాలా క్వాలిటీ మూవీస్ అయితే వస్తున్నాయని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. నిజానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పాన్ ఇండియా లో చాలా గొప్పగా చాటిన హీరోల్లో ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి నటులు మొదటి వరుసలో ఉన్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య తీవ్రమైన పోటీ అయితే నడుస్తుంది.
వీళ్లిద్దరిలో ఎవరు ముందు వరుసలో ఉన్నారు. ఎవరు ఎవరిని బీట్ చేయబోతున్నారు అనే విషయం మీదనే సర్వత్ర ఆసక్తి నెలకొంది. కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ టాప్ రేంజ్ లో దూసుకెళ్లాడు. ఒకానొక సమయంలో అల్లు అర్జున్ అసలు ఎన్టీఆర్ కి పోటీనే కాదు అనే స్థాయి నుంచి జూనియర్ ఎన్టీఆర్ ని బీట్ చేసి 1850 కోట్ల మార్కెట్ ని కొల్లగొట్టే అంత క్రేజ్ ని సంపాదించుకున్నాడు అంటే మామూలు విషయం కాదు.
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సోలో హీరోగా 1000 కోట్ల కలెక్షన్స్ ని కూడా కొట్టలేకపోయాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో వస్తున్న ‘డ్రాగన్’ సినిమాతో ఆ ఫీట్ ని అందుకుంటాడని అందరు అనుకుంటున్నారు. ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ కంటే అల్లు అర్జున్ ఒక అడుగు ముందు వరుసలో ఉన్నాడు.
ఇక రాబోయే రెండు మూడు సినిమాలతో ఇటు అల్లు అర్జున్, అటు జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు సక్సెస్ లను సాధిస్తే పోటీ అనేది తీవ్ర తరమవుతుంది. ఇక దాంతో పాటుగా ఎవరు భారీ సక్సెస్ ని సాధిస్తారు. వీరిలో ఎవరు ముందుకు సాగుతారు అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…ప్రస్తుతానికైతే ఇద్దరు భారీ ప్రాజెక్ట్ లను ప్లాన్ చేసుకుంటున్నారు…