spot_img
Homeఎంటర్టైన్మెంట్Meenakshi Chaudhary praises TTD services: TTD సేవలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రశంసల వర్షం.....

Meenakshi Chaudhary praises TTD services: TTD సేవలపై హీరోయిన్ మీనాక్షి చౌదరి ప్రశంసల వర్షం.. వైసీపీ కి పెద్ద షాక్!

Meenakshi Chaudhary praises TTD services: గత కొంతకాలం నుండి మన ఆంధ్ర ప్రదేశ్ లో రాజకీయాలు తిరుమల తిరుపతి దేవస్థానం చుట్టూనే తిరుగుతున్నాయి. వైసీపీ హయాంలో తిరుమల లడ్డు అపవిత్రం అయ్యిందని , కల్తీ నెయ్యి ని ఉపయోగించారని ఆధారాలతో సహా అడ్డం గా దొరికిపోయిన వైసీపీ ప్రభుత్వం , మొదట్లో ఎలాంటి కల్తీ జరగలేదు అంటూ వాదించే ప్రయత్నం చేసింది . కానీ జనాలు నమ్మకపోవడం తో తిరుమల లడ్డు తయారీకి ‘భోలే బాబా డైరీ’ కి అప్పట్లో నెయ్యి సరఫరా చేసిందని , ‘భోలే బాబా డైరీ’ తో చంద్రబాబు హెరిటేజ్ సంస్థ కూడా చేతులు కలిపి కల్తీ నెయ్యి ని సరఫరా చేశారని మరో అబద్దపు ప్రచారాన్ని తీసుకొచ్చి జనాలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద రాజకీయం ఇంకా కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీ , శాసన మండలి లో కూడా వాడివేడి చర్చలు నడుస్తున్నాయి.

ఇలాంటి కీలక సమయంలో ప్రముఖ యంగ్ హీరోయిన్ మీనాక్షి చౌదరి(Meenakshi Chaudhary) TTD సేవలపై ప్రశంసల వర్షం కురిపించడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది . ఆమె మాట్లాడుతూ ‘తిరుమలకు నేను తరచూ వస్తుంటాను. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవారిని దర్శించుకున్న తర్వాత నా మనసు ఎంతో ఆనందానికి , ప్రశాంతతకు గురైంది. ఇక్కడ పీల్చే గాలిలో కూడా గోవిందా నామాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయి. అంతే కాకుండా టీటీడీ అధికారుల మ్యానేజ్మెంట్ కూడా చాలా గొప్పగా ఉంది. అన్నప్రసాదాలు దగ్గర నుండి , శ్రీవారి దర్శనం కల్పించడం వరకు అన్నిరకాల సేవలు అద్భుతంగా ఉన్నాయి ‘ అంటూ తన అనుభూతిని ఒక వీడియో ద్వారా పంచుకుంది. దీనిని చూసిన నెటిజెన్స్ నిజంగానే ఇప్పుడు టీటీడీ మ్యానేజ్మెంట్ చాలా అద్భుతంగా పనిచేస్తోంది. అన్న ప్రసాదం తిరుమల లడ్డు లో క్వాలిటీ ఇప్పుడు బాగా పెరిగింది. చాలా అద్భుతంగా ఉందంటూ చెప్పుకొస్తున్నారు .

అయితే వైసీపీ పార్టీ అభిమానులు మాత్రం మీనాక్షి చౌదరి వీడియో పై విమర్శలు గుప్పిస్తోంది . ఆమె చేత ఉద్దేశపూర్వకంగానే ఈ వీడియో ని చేయించారని , తిరుమల లడ్డు వ్యవహారం లో కూటమి ప్రభుత్వం అసత్యాలు ప్రచారం చేసి జనాల్లో నెగటివిటీ ని సంపాదించుకోవడం వల్ల , డ్యామేజ్ కంట్రోల్ కోసం ఇలా మీనాక్షి చౌదరి తో వీడియో చేయించారని అంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితమే వైసీపీ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీటీడీ అధికారుల పనితీరు ని మెచ్చుకుంటూ ఒక వీడియో చేసాడు . ఈ వీడియో ని కూటమి పార్టీ అభిమానులు షేర్ చేస్తూ , ఇదిగో మీ వైసీపీ హార్డ్ కోర్ నాయకుడు కూడా టీటీడీ అధికారులను మెచ్చుకుంటున్నాడు. ఆయన చేత కూడా కూటమి ప్రభుత్వమే చెప్పించిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు కూటమి ఫ్యాన్స్.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Avinash Reddy

Avinash Reddy: కడప నుంచి అవినాష్ రెడ్డి ఔట్!

Avinash Reddy: కడప విషయంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. కడప ఎంపీ సీటు విషయంలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డికి ఈసారి మొండి చేయి చూపుతారు...
YSRCP

YSRCP: లోకేష్ కు టచ్ లో ఆ ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు?!

YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో ఛాన్స్ దక్కకపోవడంతో చాలామంది వేచి చూస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టు వ్యవహరిస్తున్న...
US Iran War

US Iran War: ఇరాన్‌తో యుద్ధం.. దివాలా తీస్తున్న అమెరికా!

US Iran War: తన సామ్రాజ్యవాద విస్తరణ కాంక్ష తీర్చుకోవడానికి అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కిరణ్తో యుద్ధం మొదలుపెట్టాడు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతోది. యుద్ధం కారణంగా ఇరాన్...
Jana Nayagan Advance Bookings

Jana Nayagan Advance Bookings: అడ్వాన్స్ బుకింగ్స్ లో అంచనాలు అందుకోలేకపోయిన ‘జన నాయగన్’..ఎంత గ్రాస్ వచ్చిందంటే..

Jana Nayagan Advance Bookings: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్ ' ఎట్టకేలకు అడ్డంకులను దాటుకొని , రేపు ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళ...
Oktelugu Epaper