Homeఎంటర్టైన్మెంట్Manoj Bajpayee: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టింది.. చిచ్చు రేపుతున్న నటుడు కామెంట్స్ !

Manoj Bajpayee: బాలీవుడ్ వెన్నులో వణుకు పుట్టింది.. చిచ్చు రేపుతున్న నటుడు కామెంట్స్ !

Manoj Bajpayee: హిందీ సినిమా పరిశ్రమ అదుపు తప్పింది. ఆ అదుపు తప్పిన హిందీ సినిమాలకు “కాపు” కాసే దర్శక నిర్మాతలు కరువు అయ్యారు. మరోపక్క ప్ర‌పంచ సినీయ‌వ‌నిక‌పై సౌత్ సినిమా ఖ్యాతిని ఇనుమ‌డింప‌జేస్తూ సౌత్ దర్శక నిర్మాతలు ముందుకు పోతున్నారు. నిజానికి ప్రస్తుతం హిందీ సినిమా వ్యాపార ధోరణి పేరుతో అదుపుతప్పి విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే.. సౌత్ సినిమా మాత్రం బాక్సాఫీస్ కి కాపు కాసిన ఆపద్భాందవుడు అవతారం ఎత్తింది.

Manoj Bajpayee
Manoj Bajpayee

దీనికి తోడు హిందీలోకి డబ్ అయిన దక్షిణాది సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయి వసూళ్లను రాబడుతూ అక్కడ కూడా భారీ మార్కెట్ ను క్రియేట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే ‘బాహుబలి’, ‘కెజియఫ్: చాప్టర్-1’, ‘బాహుబలి-2’, ‘పుష్ప’ వంటి సినిమాలు హిందీ తెర పై బంపర్ కలెక్షన్లను కొల్లగొడుతూ సరికొత్త రికార్డులను నమోదు చేశాయి.

Also Read: Hero Nikhil: కన్నీళ్లు పెట్టుకుంటూ మెసేజ్ చేసిన క్రేజీ హీరో !

అందుకే.. ఇప్పుడు సౌత్ సినిమాలు అంటే.. హిందీ స్టార్ హీరోలు కూడా ఉలిక్కి పడుతున్నారు. అందుకే.. సౌత్ సినిమాల బ్లాక్‌‌బాస్టర్ సక్సెస్‌ను చూసి బాలీవుడ్ భయపడుతోందని హిందీ నటులే కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్‌సిరీస్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ కూడా షాకింగ్ కామెంట్స్ చేశాడు.

మనోజ్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ‘ఆర్‌ఆర్ఆర్’, ‘కెజియఫ్: చాప్టర్-2’ల విజయాన్ని చూసి బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ భయపడుతున్నారు. ఈ సినిమాల సక్సెస్‌‌తో వారికి వెన్నులో వణుకు పుట్టింది. ప్రస్తుతం ఎటువంటి చిత్రాలను నిర్మించాలో వారికీ తెలియడం లేదు’’ అంటూ మనోజ్ బాజ్‌పాయ్ తీవ్ర స్థాయిలో కామెంట్స్ చేశాడు.

Manoj Bajpayee
Manoj Bajpayee

ప్రస్తుతం ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మనోజ్ బాజ్‌పాయ్ కావాలని ఈ రోజు మీడియాతో ముచ్చటించాడు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర కబుర్లను అభిమానులతో పంచుకున్నాడు. మొత్తానికి కావాలని ప్రెస్ మీట్ పెట్టి మరీ మనోజ్ బాజ్‌పాయ్ పై విధంగా మాట్లాడాడు. అలాగే మనోజ్ బాజ్‌పాయ్ ఇంకా మాట్లాడుతూ..‘‘సౌత్ వారు ప్రతి షాట్‌ను చాలా తపనతో తెరకెక్కిస్తారు. అన్నిటికీ మించి ఒక్కసారి కూడా ప్రేక్షకులను తక్కువ చేసి వారు మాట్లాడరు. ఆడియన్స్‌కు అర్థం కాదు అనే మాటలను వారు చెప్పరు. ముంబై ఫిలిం ఇండస్ట్రీలోని ఫిల్మ్ మేకర్స్ సౌత్ వారిని చూసి ఎంతో నేర్చుకోవాలి’’ అని మనోజ్ చెప్పుకొచ్చాడు.

Also Read:Zee Telugu Saregamapa 2022: సరిగమప షో: అదిరిపోయిన సింగర్స్, సూపర్ సింగర్స్ జోడీ.. ఎన్నో ఎమోషన్స్

Recommended Videos:

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Football Legends Retirement

Football Legends Retirement: దిగ్గజాల నిష్క్రమణ.. పుట్ బాల్ చరిత్రలో ముగిసిన స్వర్ణయుగం

Football Legends Retirement: ప్రపంచంలో అత్యధిక ఆదరణ పొందిన క్రీడ ఫుట్బాల్. అందుకే ఫిఫా ప్రపంచ కప్ కు విపరీతమైన క్రేజ్ ఉంటుంది. పైగా ఇది క్రీడల్లోకెల్లా అత్యధిక స్థాయిలో వీక్షణలు సొంతం...
US Iran Conflict

US Iran Conflict: అమెరికా డేటా సెంటర్ పై దాడి.. ముదిరిన యుద్ధం

US Iran Conflict: గల్ఫ్‌ ప్రాంతంలో అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు తీవ్రంగా మారాయి. రెండు దేశాలు పరస్పరం దాడులు, ప్రతీకార చర్యలతో పశ్చిమాసియా మొత్తం అగ్నిగుండంలా మారింది. వాణిజ్య నౌకల రాకపోకలకు...
FIFA World Cup Revenue

FIFA World Cup Revenue: ఫిఫా ప్రపంచ కప్.. ఎన్ని వేల కోట్లు వచ్చాయో తెలుసా..

FIFA World Cup Revenue: ఈ ప్రపంచంలో అత్యంత ప్రజాధరణ పొందిన క్రీడలలో ఫుట్ బాల్ ముందు వరుసలో ఉంటుంది. దీనిని ప్రపంచంలో మెజారిటీ దేశాలు ఆడుతూ ఉంటాయి. అంతర్జాతీయ ఫుట్...
Amitabh Bachchan

Amitabh Bachchan: ICU లో అమితాబ్ బచ్చన్.. అభిమానుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్న లేటెస్ట్ పోస్ట్..

Amitabh Bachchan: 83 ఏళ్ళ వయస్సు లో కూడా వరుసగా సినిమాలు చేస్తూ , నేటి తరం యంగ్ హీరోలతో పోటీ పడుతున్న ఏకైక ఇండియన్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అమితాబ్...
YSRCP Land Scam

YSRCP Land Scam: వందల కోట్ల 15.94 ఎకరాల ప్రభుత్వ భూమిని వైసీపీ నేతలకు రాసి ఇచ్చేశాడు..

YSRCP Land Scam: వడ్డించేవాడు మనవాడైతే బంతిలో ఎక్కడ కూర్చున్నా సరే బ్రహ్మాండంగా ముక్కలు పడతాయి.. ఈ సామెతను ఆ రెవెన్యూ అధికారి నిజం చేసి చూపించారు. తనకు ఆయాచితమైన చోటు...
Oktelugu Epaper