Homeఎంటర్టైన్మెంట్టాలీవుడ్ కోసం రూ.500 కోట్లు దానమిచ్చాడు.. ఆ నటుడు ఎవ‌రో తెలుసా..?

టాలీవుడ్ కోసం రూ.500 కోట్లు దానమిచ్చాడు.. ఆ నటుడు ఎవ‌రో తెలుసా..?

రీల్ హీరోలు చేసే త్యాగాల గురించి మ‌న అంద‌రికీ తెలిసిందే. వంద‌ల కోట్లు అలా రాసిచ్చేస్తారు.. ఆస్తుల‌న్నీ ధారాద‌త్తం చేస్తుంటారు. చివ‌ర‌కు నిరుపేద‌ల కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతారు. కానీ.. ఆయ‌న రీల్ లైఫ్ లో విల‌న్‌. రియ‌ల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు! సినీ కార్మికుల కోసం ఒకటీ రెండు కాదు.. దాదాపు 500 కోట్లు విలువ‌గ‌ల భూమిని రాసిచ్చేశాడు. ఆయ‌నే నిన్న‌టి త‌రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు మందాడి ప్ర‌భాక‌ర్ రెడ్డి. Also Read: […]

Mandadi Prabhakar Reddy
రీల్ హీరోలు చేసే త్యాగాల గురించి మ‌న అంద‌రికీ తెలిసిందే. వంద‌ల కోట్లు అలా రాసిచ్చేస్తారు.. ఆస్తుల‌న్నీ ధారాద‌త్తం చేస్తుంటారు. చివ‌ర‌కు నిరుపేద‌ల కోసం ప్రాణాలిచ్చేందుకు కూడా సిద్ధ‌మ‌వుతారు. కానీ.. ఆయ‌న రీల్ లైఫ్ లో విల‌న్‌. రియ‌ల్ లైఫ్ లో మాత్రం హీరో అయ్యాడు! సినీ కార్మికుల కోసం ఒకటీ రెండు కాదు.. దాదాపు 500 కోట్లు విలువ‌గ‌ల భూమిని రాసిచ్చేశాడు. ఆయ‌నే నిన్న‌టి త‌రం క్యారెక్ట‌ర్ ఆర్టిస్టు మందాడి ప్ర‌భాక‌ర్ రెడ్డి.

Also Read: హాట్ బ్యూటీ షాకింగ్ నిర్ణయం !

ఈ తరం ప్రేక్షకులకు ఆయ‌న పెద్ద‌గా పరిచయం లేక‌పోవ‌చ్చు. కానీ.. ఇప్పుడు సీనియ‌ర్లు వెలుగొందుతున్న హీరోల‌తో ఆయ‌న చాలా సినిమాలు చేశారు. ఒక‌టీ రెండు కాదు.. దాదాపు 400 పైగా సినిమాల్లో నటించి, మెప్పించిన సీనియర్ నటుడు ప్ర‌భాక‌ర్ రెడ్డి. అయితే.. ఆయ‌న కేవ‌లం న‌టుడే కాదు. నిర్మాత, దర్శకుడు కూడా!

ఎన్టీఆర్, ఏఎన్నార్ నుంచి చిరంజీవి వరకు చాలా మంది హీరోల‌ సినిమాల్లో విలన్ పాత్ర‌లు పోషించిన ప్ర‌భాక‌ర్ రెడ్డి.. నిజ జీవితంలో మ‌న‌సున్న మ‌నిషి. సినీ కార్మికుల కోసం ఆయ‌న చేసిన దానాలే ఆయ‌న వ్య‌క్తిత్వాన్ని చాటి చెప్తాయి. ఇక‌, ప్ర‌భాక‌ర్ రెడ్డి కేవలం నటుడు మాత్రమే కాదు.. అద్భుతమైన డాక్ట‌ర్ కూడా. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. వైద్యుడిగా కూడా ప‌నిచేశారు.

అయితే.. త‌మిళ‌నాడు నుంచి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విడిపోయిన త‌ర్వాత కూడా చాలా కాలం వ‌ర‌కు తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ మ‌ద్రాసు కేంద్రంగానే ఉంది. దీంతో.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ స‌హా చాలా మంది ఇండ‌స్ట్రీని హైదరాబాద్‌కు తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు మొద‌లు ఎట్టారు. ఈ క్రమంలోనే స్టూడియోలు నిర్మించడం.. వంటివి చేశారు. అలాంటి సమయంలో ప్రభాకర రెడ్డి మాత్రం పేద సినీ కళాకారుల కోసం ఏకంగా 10 ఎకరాల భూమిని ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పుకుంటున్న చిత్రపురి కాలనీ ఉన్న‌ది ప్ర‌భాక‌ర్ రెడ్డి దాన‌మిచ్చిన స్థ‌లంలోనే.

Also Read: చిరంజీవి కోసం రానా సంచలన నిర్ణయం

అందుకే.. ఇప్ప‌టికీ ఆ కాల‌నీని ప్రభాకర రెడ్డి చిత్రపురి కాలనీ అంటారు. ఆ ప్రాంతం ఇప్పుడున్న‌ది జూబ్లీ హిల్స్ స‌మీపంలో. అక్క‌డ సెంటు భూమి ధరే ల‌క్ష‌ల్లో ఉంటుంది. ఆ విధంగా.. ఎకరానికి హీన‌ప‌క్షంగా రూ.50 కోట్లు వేసుకున్నా కూడా.. మొత్తం రూ.500 కోట్ల లెక్క తేలుతుంది. అంటే.. ప్ర‌భాక‌ర రెడ్డి కార్మికుల కోసం రూ.500 కోట్ల విలువైన భూమిని దానం చేశాడ‌న్న‌మాట‌.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper