Donations: మనం సంపాదించిన దాంట్లో ఎంతో కొంత దానం ఇవ్వాలి.. లేకుంటే లావైపోతారు.. అన్న ఈ సినిమా డైలాగ్ అందరినీ ఆకర్షించినా.. రియల్ జీవితంలో చాలామంది ఇతరులకు సహాయపడుతూ ప్రత్యేకంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. కొంతమంది తమకు వచ్చిన సంపాదనతో మరింతగా అభివృద్ధి చేయాలని అనుకుంటారు. మరికొంతమంది మాత్రం తమకు వచ్చిన దాంట్లో ఇతరులకు దానం ఎక్కువగా చేయాలని చూస్తారు. అయితే ఈ ఏడాదిలో ఒకరి కంటే ఒకరు పోటీపడి దానధర్మాలు చేశారు. అలా అత్యధికంగా శివ్ నాడార్ కంపెనీ రూ.2,708 కోట్లను దానం చేసింది. ఈ కంపెనీ తో పాటు మిగతా కంపెనీలు కూడా తమ విరాళాన్ని ప్రకటించాయి. అయితే టాప్ టెన్ విరాళాల్లో ఏ కంపెనీలు ఉన్నాయో చూద్దాం..
ఎడెల్ గివ్ హురున్ ఇండియా తాజాగా అత్యధికంగా దానం చేసిన పదిమంది జాబితాను ప్రకటించింది. వీరిలో శివ్ నాడార్ తో పాటు అతని కుటుంబం కలిసి మొత్తం రూ.2,708 కోట్లను దానం చేసింది. విద్య, వైద్యం, మౌలిక వసతుల అభివృద్ధికి వీటిని ఉపయోగించారు. గత ఐదేళ్లుగా దానం చేయడంలో మీరు నెంబర్ వన్ స్థానంలో ఉంటున్నారు. సగటున వేరు రోజుకు రూ. 7.4 కోట్ల దానం చేస్తున్నారు.
2025 ఆర్థిక సంవత్సరంలో రిలయన్స్ ఫౌండేషన్ ద్వారా రూ. 626 కోట్లను విరాళంగా ఇచ్చారు. క్రీడలు, కలలు వంటి వివిధ రంగాల వారికి ప్రోత్సాహాన్ని అందిస్తూ వీరు దానం చేశారు. మారుమూల ప్రాంతాల నుంచి పెద్దపెద్ద నగరాల వరకు దాదాపు 8.7 కోట్ల మందికి సేవ చేశారు.
దానం చేసిన వారి లో బజాజ్ గ్రూప్ ట్రస్ట్ మూడో స్థానంలో నిలిచింది. ఈ కంపెనీ మొత్తంగా రూ. 446 కోట్ల విరాళాన్ని అందించింది. ఇది గత సంవత్సరం కంటే 33 శాతం ఎక్కువ. సామాజిక అంశాలను అర్థం చేసుకొని వారికి సరైన విధంగా విరాళాన్ని ప్రకటిస్తూ ఉంటారు.
ఆదిత్య బిర్లా ఫౌండేషన్ అధినేత కుమార్ మంగళం బిర్లా తో పాటు అతని ఫ్యామిలీ కలిపి ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 440 కోట్ల విరాళాన్ని అందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో ఈ ఫౌండేషన్ రూ. 500 కోట్ల విరాళాన్ని అందించింది. ఇప్పుడు రూ. 440 కోట్ల విరాళంతో నాలుగో స్థానంలో నిలిచింది. సామాజిక కార్యక్రమాల కోసం ఈ ఫౌండేషన్ ఎక్కువగా విరాళాలు ఇస్తూ ఉంటుంది.
అదా నీ ఫౌండేషన్ ఈ ఏడాదిలో రూ.376 కోట్లను విరాళంగా ఇచ్చి ఐదు స్థానంలో నిలిచింది. సామాజిక పరిస్థితులను అర్థం చేసుకొని మీరు విరాళం ఇస్తూ ఉంటారు. ఆ తర్వాత నీలేకని పిలాంతర పీస్ సంస్థ రూ. 304 కోట్ల విరాళాన్ని అందించింది. హిందూజా ఫౌండేషన్ రూ. 298 కోట్ల విరాళాన్ని ప్రకటించింది. రోహిణి నిలేఖని పిలాంతరపీస్ రూ. 204 కోట్లు, యూ ఎన్ em అధినేత రూ.189 కోట్ల విరాళాన్ని అందించారు. విల్లు పూనావాలా ఫౌండేషన్ ద్వారా రూ.173 కోట్ల విరాళం అందించారు.