ఇప్పుడు ఏపీలో పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. అధికార వైసీపీ , ప్రతిపక్ష టీడీపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. జగన్, చంద్రబాబు పంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థులకు మద్దతుగా వ్యూహ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. కానీ మన ఘనత వహించిన జనసేనాని పవన్ కళ్యాణ్ మాత్రం హైదరాబాద్ లోనే ఉంటూ ఏపీ పంచాయతీని.. కనీసం జనసేన క్యాడర్ ను పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆ పార్టీ నేతలు వాపోతున్న పరిస్థితి నెలకొంది.
*పవన్ ది కాదు.. జనసైనికులదే ఈ క్రెడిట్
ఏపీలో పంచాయతీ ఎన్నికల వేళ జనసేనాని పవన్ రాకపోయినా.. పార్టీలో నంబర్ 2 నేత నాదెండ్ల మనోహర్ పట్టించుకోకపోయినా.. పెద్ద లీడర్లు ముందుకు రాకపోయినా.. క్యాడర్ మాత్రం పంచాయతీ ఎన్నికల గెలుపు బాధ్యతను తమ భుజాన వేసుకుంది. ఫలితం జనసేనకు మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో 18శాతంకు పైగా ప్రజలు ఓటేస్తే.. రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో ఏకంగా 22శాతానికి పైగా ప్రజలు జనసేనకు పట్టం కట్టారు. ఈ గణాంకాలను చూసి జనసేనాని బయటకు వచ్చి హైదరాబాద్ లో వీటిని ఘనంగా చెప్పుకొని ఈరోజు సంబరపడిపోయాడు. కానీ ఎవ్వరు రాకున్నా.. నేతలు పట్టించుకోకున్నా కూడా గ్రామాల్లో జనసేనకు ఇంతటి ఆదరణ దక్కిందంటే పవన్ కానీ, నాదెండ్ల కానీ.. ఆ పార్టీ నేతలు ఎంత మాత్రం కాదు.. ఆ పార్టీనే నమ్ముకొని.. పవన్ అంటే పిచ్చి ప్రేమతో ఉన్న అభిమానులు, కార్యకర్తలతోనే ఈ గెలుపు సాధ్యమైంది. పవన్ వదిలేసినా ఈ పార్టీని ఏకంగా 22 శాతం ప్రజల మెప్పు పొందారంటే ఈ ఘతన అది క్షేత్రస్థాయి నేతలదే అనడంలో ఎలాంటి సందేహం లేదు. .
*జనసేనకు బలం లేకున్నా పంచాయతీలను ఎలా గెలిచింది?
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: What is the reason for janasenas victory in ap panchayat elections
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com