spot_img
Homeఎంటర్టైన్మెంట్Manchu Vishnu- Vishwak Sen: 'అతి చేస్తే తోక కత్తిరిస్తా' అంటూ విశ్వక్ సేన్ కి...

Manchu Vishnu- Vishwak Sen: ‘అతి చేస్తే తోక కత్తిరిస్తా’ అంటూ విశ్వక్ సేన్ కి వార్నింగ్ ఇచ్చిన మంచు విష్ణు

Manchu Vishnu- Vishwak Sen: ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లో కలకలం రేపిన అంశం అర్జున్ – విశ్వక్ సేన్ వివాదం..కొద్ది రోజుల క్రితం అర్జున్ దర్శకుడిగా వ్యవహరిస్తూ తన సొంత నిర్మాణ సంస్థ లో విశ్వక్ సేన్ ని హీరోగా, తన కూతురు ఐశ్వర్య ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమాని ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సినిమా ప్రారంభానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధి గా హాజరయ్యాడు..అట్టహాసం గా ప్రారంభమైన ఈ చిత్రం ఇప్పుడు అట్టకెక్కింది..విశ్వక్ సేన్ కోసం షెడ్యూల్ ని అనేకసార్లు వాయిదా వేశానని.

Manchu Vishnu- Vishwak Sen
Manchu Vishnu- Vishwak Sen

అంతా మాట్లాడుకొని ఓకే అనుకున్నాక రేపు షెడ్యూల్ ప్రారంభం అంటే ఆరోజు ఉదయం షూటింగ్ ని క్యాన్సిల్ చెయ్యండి అంటూ మెసేజి పెట్టాడు..సీనియర్స్ అంతే గౌరవం లేనోడితో సినిమా ఒప్పుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది..అలాంటోడితో సినిమా చెయ్యడం నాకు ఇష్టం లేదు..అందుకే ఈ ప్రాజెక్ట్ ని క్యాన్సిల్ చేస్తున్నాను అంటూ ఫిలిం ఛాంబర్ లో అర్జున్ విశ్వక్ సేన్ పై కంప్లైంట్ చేసిన సంఘటన ఎంత పెద్ద దుమారం రేపిందో మన అందరికి తెలిసిందే.

ఇక ఆ తర్వాత విశ్వక్ సేన్ కూడా దీనిపై రెస్పాన్స్ ఇచ్చాడు..ఆయన మాట్లాడుతూ ‘షూటింగ్ ఈరోజు అనగా..అదే రోజు ఉదయం షూటింగ్ క్యాన్సిల్ చెయ్యండి అనడం నా తప్పే..కానీ నేను ఈ సినిమా నుండి తప్పుకోవాలి అని మాత్రం అనుకోలేదు..కథలో నాకు నచ్చనివి చాలా ఉన్నాయి..కేవలం వాటి గురించి ఒకరోజు మాట్లాడుకుందాము అని మాత్రమే అన్నాను..కేవలం ఒక్క రోజు షూటింగ్ మాత్రమే ఆపమని చెప్పాను..ఆ మెసేజి చేసిన తర్వాత నేను నా మేనేజర్ అర్జున్ గారిని కలవడానికి ఎంతో ప్రయత్నం చేసాము..కానీ కాసేపు తర్వాత ఆయన మేనేజర్ నాకు కాల్ చేసి..ఇంకేంటి సినిమా చేసేది..తీసుకున్న డబ్బులు తిరిగి ఇచ్చేయమని అకౌంట్ డీటెయిల్స్ పెట్టారు..ఇదే అక్కడ జరిగింది..నా మాటకి విలువ లేదు..మనసుని చంపుకొని నేను నటించలేను..అందుకే మాట్లాడుకుందాం అని చెప్పా..కానీ ఈలోపే అర్జున్ సార్ ఇలా చేసాడు’ అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.

Manchu Vishnu- Vishwak Sen
Manchu Vishnu

ఫిలిం ఛాంబర్ లో అర్జున్ ఇచ్చిన కంప్లైంట్ గురించి ప్రెసిడెంట్ మంచు విష్ణు మాట్లాడుతూ ‘అర్జున్ లాంటి సీనియర్ ఆర్టిస్టు కి అవమానం జరిగింది అంటే కచ్చితంగా నేను విశ్వక్ సేన్ ని వివరణ కోరుతాను..దీనికి ఆయన సమాధానం చెప్పాలి..ఎంత పెద్ద స్టార్ అయినా కూడా సీనియర్స్ కి మర్యాద ఇవ్వాల్సిందే..యాటిట్యూడ్ వంటివి చూపిస్తే తోకలు కత్తిరిస్తా ‘ అని మంచు విష్ణు చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు ఆ రొమాంటిక్ సీన్ చేసేటప్పుడు బాగా ఇబ్బంది పడ్డాడట…

Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా చేసిన చాలా సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు తను చేసే ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉండే...
National Flag Day

National Flag Day: 1906లో మన జాతీయ జెండా ఎలా ఉండేదో తెలుసా.. ప్రేరణాత్మక ప్రయాణం!

National Flag Day: భారత జాతీయ జెండా కేవలం మూడు రంగుల వస్త్రం కాదు. అది మన స్వాతంత్య్ర సంగ్రామం ఆశలు, త్యాగాలు, ఐక్యత, భవిష్యత్తు కలలను ప్రతిబింబించే చిహ్నం. 1947 జూలై...
Pawan Kalyan

Pawan Kalyan: ప్రకాశం జిల్లాకు మహర్దశ.. దశాబ్దాల సమస్యని పరిష్కరించిన పవన్ కళ్యాణ్..

Pawan Kalyan: దశాబ్దాలు గా ప్రకాశం జిల్లా వాసులు ఎదురుకుంటున్న సమస్యలకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపించబోతున్నారు. అక్కడ కొన్ని ప్రాంతాల్లో ఎన్నో...
iQOO Z11 Lite 5G

iQOO Z11 Lite 5G: తక్కువ బడ్జెట్‌లో ఎక్కువ బ్యాటరీ లైఫ్.. మార్కెట్లోకి రానున్న కొత్త ఫోన్..

iQOO Z11 Lite 5G:  ప్రస్తుతం చాలా మంది ఫోన్ కొనే సమయంలో బ్యాటరీ లైఫ్ గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఎక్కువ మన్నిక గల బ్యాటరీ ఉన్న ఫోన్ ధరలు అధికంగా ఉంటున్నారు....
Tata Sierra

Tata Sierra: కఠినమైన రోడ్లపై కూడా సాఫీగా సాగేలా.. టాటా కొత్త ప్రయోగం..

Tata Sierra: ప్రస్తుత కాలంలో కారు కొనే ముందు చాలా విషయాలు ఆలోచిస్తున్నారు. కొందరు కేవలం సిటీలో మాత్రమే రన్ అయ్యే కారుపై ఆసక్తి చూపుతుండగా..మరికొందరు మాత్రం లాంగ్ డ్రైవ్ లో గతుకుల...
Oktelugu Epaper