Bigg Boss 6 Telugu- Adi Reddy: బిగ్ బాస్ హౌస్ లో ప్రేక్షకులందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూసేది సోమవారం కోసం..ఎందుకంటే ఆరోజు నామినేషన్స్ కాబట్టి..నామినేషన్స్ రోజు హౌస్ మొత్తం ఎంత వాడివేడిగా ఉంటుందో మన అందరికి తెలిసిందే..ప్రతి వారంలో లాగానే ఈ వారం కూడా ఇంటి సభ్యుల నామినేషన్స్ వాగ్వివాదాల మధ్య కొనసాగింది..ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి నామినేటైనా ఇంటి సభ్యులు ఆది రెడ్డి, శ్రీహన్ , రేవంత్ , బాలాదిత్య, ఫైమా , కీర్తి, ఇనాయ సుల్తానా ,మరీనా మరియు వాసంతి..వీరిలో ఈరోజు ఆది రెడ్డి మరియు ఇనాయ పై అత్యధిక ఇంటి సభ్యులు నామినేషన్స్ వేశారు.

ఇక ఆది రెడ్డి అయితే మనసులో ఏది ఉంటె అది ఫిల్టర్ లేకుండా మనస్ఫూర్తిగా చెప్తాడు అనే పేరు బాగానే ఉంది..సొంత స్నేహితులైన..శత్రువులైన ఆయన దగ్గర పాయింట్ ఉన్నప్పుడు చెప్పడానికి ఏ మాత్రం మొహమాటం పడదు..ఇక ఈ వారం అయితే ఆయన నేరుగా బిగ్ బాస్ మీదనే ఆరోపణలు చేసాడు.
ఇక అసలు విషయానికి వస్తే గత వారం కెప్టెన్సీ టాస్కు లో భాగంగా జరిగిన ‘మిషన్ పాజిబుల్’ టాస్కులో బ్లూ స్క్వాడ్ కి టీం లీడర్ గా వ్యవహరించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ టాస్కు లో గీతూ చేసిన చిన్న ట్రిక్ వల్ల ఆది రెడ్డి సహనం కోల్పోయి టీ-షర్ట్ మరియు దానితో పాటు ఆయన ధరించిన మైక్ ని నేలకేసి కొట్టి టాస్కు నుండి ఎలిమినటవ్వడం మన అందరం చూసాము..’నీ వల్లే మన టీం ఓడిపోయింది అంటూ’ ఆ టీం లో పాల్గొన్న కంటెస్టెంట్స్ ఆదిరెడ్డి ని నామినేట్ చేసారు.

అప్పుడు ఆదిరెడ్డి మాట్లాడుతూ ‘వాళ్ళు అన్ ఫెయిర్ గేమ్ ఆడేలోపు నాకు కోపం వచ్చి ఆవేశం లో చేసిన పని అది..ఉద్దేశపూర్వకంగా చేసినది కాదు..ఒకవేళ వాళ్ళు ఆడిన గేమ్ రాంగ్ అని నన్ను చంపేయకుండా బిగ్ బాస్ అప్పుడే నన్ను బ్రతికించి ఉంటె నేను అలా చేసి ఉండేవాడిని కాదు కదా..తప్పు జరుగుతున్నప్పుడు బిగ్ బాస్ హెచ్చరించలేదు వాళ్ళని..కాబట్టి బిగ్ బాస్ అన్ ఫెయిర్ గా ఉండడం వల్లే మన టీం ఓడిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు..బిగ్ బాస్ మీద ఆరోపణలు చేసినందుకు ఈ వీకెండ్ ఆది రెడ్డి ని మందలించి నాగార్జున గారు ఇంటికి పంపేస్తారా..లేదా వార్నింగ్ ఇస్తారా అని నెటిజెన్లు సోషల్ మీడియా లో పోస్టులు పెడుతున్నారు.