Sharwanand- Arjun: యాక్షన్ కింగ్ అర్జున్ ఇటీవలే తన స్వీయ దర్శకత్వం లో విశ్వక్ సేన్ ని హీరో గా, ఆయన కుమార్తె ఐశ్వర్య ని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా ని ప్రారంభించిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ మూవీ ప్రారంభోత్సవానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యాడు..అయితే అర్జున్ మరియు విశ్వక్ సేన్ మధ్య ఏర్పడిన వివాదం వల్ల ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది..ప్రస్తుతం టాలీవుడ్ లో ట్రేండింగ్ టాపిక్ ఇదే..విశ్వక్ సేన్ ని ఈ సినిమా నుండి తప్పించిన తర్వాత ఇప్పుడు మరో హీరో కోసం వెతుకుతున్నాడట అర్జున్.

అలా వెతుకుతున్న సమయం లో ప్రముఖ హీరో శర్వానంద్ ని ఈ సినిమా కోసం సంప్రదిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నాడట అర్జున్..ఈ కథకి శర్వానంద్ అయితే నూటికి నూరుపాళ్లు న్యాయం చేయగలడని..అతని డేట్స్ ఎలా అయినా సంపాదించాలని అర్జున్ ప్రయత్నాలు చెయ్యడం ప్రారంబించాడట..శర్వానంద్ ప్రస్తుతం కృష్ణ చైతన్య అనే దర్శకుడితో ఒక సినిమా ఒప్పుకున్నాడు..త్వరలోనే ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది.
ఈ సినిమా తర్వాత చెయ్యబొయ్యే సినిమా కూడా ఆయన ఇప్పటికే కమిట్ అయిపోయినట్టు తెలుస్తుంది..ప్రముఖ దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య తో ఆ సినిమా ఉండబోతుందట..ఇలా వరుసగా రెండు సినిమాలు కమిటైన శర్వానంద్ ఇప్పుడు అర్జున్ కోసం డేట్స్ కేటాయిస్తాడా అనేది సందేహం గా మారింది..ఇప్పుడు అర్జున్ కి నాన్ స్టాప్ గా నెల రోజుల పాటు డేట్స్ ఇచ్చే హీరో కావాలి..ఎందుకంటే ఆయన దానికి తగ్గట్టుగా ఆర్టిస్టుల డేట్స్ ని తీసుకొని అడ్వాన్స్ ఇచున్నాడు..మరి శర్వానంద్ అన్ని డేట్స్ ఇవ్వగలడా లేదా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న.

మరోపక్క అర్జున్ విశ్వక్ సేన్ పై ఫిలిం ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చి, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఆయనతో కుర్ర హీరోలు పనిచేయడానికి బెంబేలెత్తిపోతున్నారు..ఇలాంటి పరిస్థితి లో ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న శర్వానంద్ వంటి హీరోలతో అర్జున్ కి సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి..మరి ఒకవేళ శర్వానంద్ ఈ సినిమా చెయ్యడానికి ఒప్పుకుంటే అర్జున్ ఏ చిన్న విషయం లో నొచ్చుకున్న ఇలాగె ప్రెస్ మీట్ పెట్టి రచ్చ చేస్తాడా అనేది చూడాలి.