Homeఎంటర్టైన్మెంట్Manchu Lakshmi show Ajay Ghosh Fight: మంచు లక్ష్మి షోలో కొట్లాటకు దిగిన నటుడు...

Manchu Lakshmi show Ajay Ghosh Fight: మంచు లక్ష్మి షోలో కొట్లాటకు దిగిన నటుడు అజయ్ ఘోష్.. సంచలనం రేపుతున్న వీడియో..

Manchu Lakshmi show Ajay Ghosh Fight: సోషల్ మీడియా లో మీమర్స్ కి ట్రేండింగ్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న సినీ నటుల్లో ఒకరు మంచు లక్ష్మి. ఈమె మాట్లాడే ప్రతీ మాట సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోల్స్ కి గురి కాబడుతుందో మనం గతం లో చాలానే చూశాము. ఆమె బాషా అమెరికన్ స్లాంగ్ లో ఉంటుంది. సోషల్ మీడియా లో వచ్చే ఈ ఫన్నీ ట్రోల్స్ ని మంచు లక్ష్మి […]

Manchu Lakshmi show Ajay Ghosh Fight: సోషల్ మీడియా లో మీమర్స్ కి ట్రేండింగ్ సెలబ్రిటీ గా పేరు తెచ్చుకున్న సినీ నటుల్లో ఒకరు మంచు లక్ష్మి. ఈమె మాట్లాడే ప్రతీ మాట సోషల్ మీడియా లో ఏ రేంజ్ ట్రోల్స్ కి గురి కాబడుతుందో మనం గతం లో చాలానే చూశాము. ఆమె బాషా అమెరికన్ స్లాంగ్ లో ఉంటుంది. సోషల్ మీడియా లో వచ్చే ఈ ఫన్నీ ట్రోల్స్ ని మంచు లక్ష్మి కూడా సరదాగానే తీసుకుంటూ వచ్చింది. ఇకపోతే రేపు తిరువూర్ హీరో గా నటించిన ‘పాపం ప్రతాప్’ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఈ చిత్రం ప్రొమోషన్స్ లో ఏ రేంజ్ లో పాల్గొంటున్నారో మనం ప్రతి రోజు చూస్తూనే ఉన్నాం. ఎక్కడ చూసినా ఈ మూవీ టీం కనిపిస్తోంది. అయితే ప్రొమోషన్స్ లో భాగంగా ఈ మూవీ టీం తో మంచు లక్ష్మి చేసిన ఒక ఇంటర్వ్యూ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఈ ఇంటర్వ్యూ లో సినిమాలోని ఒక సన్నివేశాన్ని రీ క్రియేట్ చేశారు , అందులో కీలక పాత్ర పోషించిన అజయ్ ఘోష్. ఇదిగో వీళ్ళే ఎదో చేశారమ్మా అని ఒక నటుడు అనగా , అందుకు అజయ్ ఘోష్ కౌంటర్ ఇస్తూ ‘రేయ్.. చంపి దెం**’ అంటూ బూతులు మాట్లాడుతూ , ఆ నటుడిపై కాళ్ళెత్తి కొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది . గతం లో సీనియర్ హీరోయిన్ రోజా జీ తెలుగు ఛానల్ లో ‘బ్రతుకు జట్కా బండి’ అనే షో ని నిర్వహించేది గుర్తుందా?, ఆ షో కి స్పూఫ్ గా ఇక్కడ మంచు లక్ష్మి రోజా పాత్ర పోషిస్తూ , రీ క్రియేట్ చేశారు.

ఈ ఫన్నీ స్కిట్ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఇదంతా పక్కన పెడితే రేపు విడుదల అవ్వాల్సిన ఈ సినిమాకు సంబంధించిన ప్రీమియర్ షోస్ ని రెండు తెలుగు రాష్ట్రాల్లో నేడు సాయంత్రం నుండి ప్లాన్ చేశారు మేకర్స్. కానీ సెన్సార్ నుండి ఈ సినిమాకు చిక్కులు ఎదురైంది. ఎందుకంటే ఈ సినిమాలోని ఒక సన్నివేశం లో వైల్డ్ యానిమల్ ఉంటుందట. అది కంప్యూటర్ గ్రాఫిక్స్ ద్వారా క్రియేట్ చేసిన యానిమల్ నా ?, లేదంటే నిజంగానే ఉపయోగించారా ? అని నిర్ధారణ చేసుకోవడం కోసం , నేడు రావాల్సిన సెన్సార్ సర్టిఫికేట్ ని హోల్డ్ లో పెట్టారు. దీంతో ఇప్పుడు ఈ చిత్రం రేపు విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by PemsTV (@pemstv)

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper