Sumathi Satakam Collection: టీవీ సీరియల్స్, బిగ్ బాస్ రియాలిటీ షో, ఎంటర్టైన్మెంట్ షోస్ ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు బాగా సుపరిచితమైన అమర్ దీప్ చౌదరి(Amardeep Chowdary), తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ హీరో గా చేసిన ‘సుమతీ శతకం'(Sumathi Satakam Movie) చిత్రం నిన్న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదలైంది. బుల్లితెర ద్వారా అమర్ దీప్ సంపాదించుకున్న క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుది కాదు, కానీ అది సినిమాకు టిక్కెట్లు తెగేలా చేస్తుందా లేదా అనే అనుమానం ప్రతీ ఒక్కరిలోనూ ఉండేది. ఎందుకంటే గతం లో ఇలాగే ‘బిగ్ బాస్ 5’ టైటిల్ విన్నర్ సన్నీ, అలాగే ‘బిగ్ బాస్ 4’ టాప్ 3 కంటెస్టెంట్ సోహైల్ సినిమాల్లో హీరోలు గా నటించి సమయం, డబ్బు రెండూ వృధా చేసుకున్నారు. సోహైల్ అయితే ‘నా సినిమా చూడండి భయ్యా..ప్లీజ్’ అంటూ మీడియా ముందుకొచ్చి కన్నీళ్లు పెట్టుకోవడం అప్పట్లో పెద్ద హాట్ టాపిక్ గా మారింది.
అమర్ దీప్ పరిస్థితి కూడా ఇలాగే ఉంటుందని అందరూ ఊహించారు. కానీ ‘సుమతీ శతకం’ చిత్రం లోని పాటలు, ట్రైలర్ చాలా బాగుండడంతో, ఎక్కడో ఈ సినిమా క్లిక్ అవుతుంది అనే ఆశ అమర్ దీప్ ని అభిమానించే వారిలో కలిగింది. నిన్న ఈ సినిమాని చూసిన వాళ్ళు కూడా బాగానే ఉందంటూ రివ్యూస్ ఇచ్చారు. కానీ ఆ పాజిటివ్ రివ్యూస్ ఈ సినిమాకు కలెక్షన్స్ ని తీసుకొని రావడంలో మాత్రం విఫలమైంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం చూస్తే ఈ చిత్రానికి వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ వద్ద కేవలం 18 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చిందట. ఈ గ్రాస్ కి షేర్ రావడం చాలా కష్టమే. అంటే సున్నా నుండి నెగటివ్ షేర్స్ నమోదు అయ్యాయి అని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఒక డీసెంట్ స్థాయి కంటెంట్ ఉన్న సినిమాకు ఇలాంటి పరిస్థితి రావడం విచారకరం. పైగా అమర్ దీప్ ఈ చిత్రాన్ని జనాల్లోకి తీసుకెళ్లడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చేసాడు. తన సహచర బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో భారీ రేంజ్ లో ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రచారం చేయించాడు. అంతే కాకుండా జనాల్లోకి వచ్చి ప్రొమోషన్స్ కూడా చేసాడు. ఎన్నో ఇంటర్వ్యూస్ ఇచ్చాడు, చివరికి తన అభిమాన హీరో రవితేజ చేత కూడా ఒక వీడియో బైట్ ని ఇప్పించుకున్నాడు. ఇన్ని చేసినా కూడా ఈ చిత్రానికి ఆడియన్స్ థియేటర్స్ వైపు కదల్లేదు. దీనిని బట్టీ అర్థం చేసుకోవాల్సినది ఏమిటంటే, బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి హీరో అవ్వాలనే కోరిక ఉండొచ్చు, కానీ డైరెక్ట్ గా హీరో అవ్వాలనుకుంటే ఇలాంటి పరిస్థితులే ఎదురు అవుతాయి. క్యారెక్టర్ రోల్స్ ద్వారా ముందు మంచి పేరు సంపాదించి వెండితెర ఆడియన్స్ కి పరిచయం అవ్వాలి, ఆ తర్వాత కావాలంటే హీరోగా ప్రయత్నాలు చేసుకోవచ్చు. అలా కాకుండా ఉన్న బుల్లితెర రంగంలోనే వచ్చిన అవకాశాలను అందుకుంటూ ముందుకు వెళ్తే పెద్ద రేంజ్ కి చేరుకుంటారు. అందుకు ఉదాహరణ మానస్. బుల్లితెర నుండి వచ్చే ప్రతీ అవకాశాన్ని అందుకుంటూ ఈరోజు ఫుల్ బిజీ గా ఉన్నాడు. అమర్ దీప్ కూడా అలా కొనసాగితే బాగుంటుందని అంటున్నారు నెటిజెన్స్.
