spot_img
Homeఎంటర్టైన్మెంట్Balakrishna-Mahesh Babu: బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు !

Balakrishna-Mahesh Babu: బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు !

Balakrishna-Mahesh Babu: బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షో ‘ఆహా’లోనే రికార్డ్ స్థాయిలో హిట్ అయింది. ఇప్పుడు ఆ షోకి మహేష్ బాబు ముఖ్య అతిథిగా వచ్చాడు. కాగా ఈ ఎపిసోడ్ తాలూకు ప్రోమో కూడా నిన్న రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఆ ప్రోమో ఫుల్ వైరల్ అవుతుంది. ముఖ్యంగా ప్రోమోలో చాలా అంశాలే హైలైట్ అయ్యాయి. మెయిన్ గా మహేష్ చేసిన కొన్ని కామెంట్స్ చాలా బాగా పేలాయి. అలాగే ఎమోషనల్ గా ప్రతి ఒక్కరినీ కదిలించింది కూడా.

Balakrishna-Mahesh Babu
Balakrishna-Mahesh Babu

మహేష్ వేలాది మంది చిన్నారులకు గుండె ఆపరేషన్స్ చేయిస్తున్నాడు. ఆ అంశం పై ప్రోమోలో మహేష్ చెప్పిన మాటలు ఎమోషనల్ గా ఉన్నాయి. అలాగే మహేష్, వేయి మంది చిన్నారులకు ఉచితంగా గుండె ఆపరేషన్లు చేయించినట్లు బాలయ్య తెలిపారు. ఈ క్రమంలో తన కుమారుడు గౌతమ్ గురించి చెబుతూ మహేష్ ఎమోషనల్ అయ్యాడు. పైగా బాలయ్య మహేష్ ని కొన్ని తమాషా ప్రశ్నలు అడిగాడు. అంతే చమత్కారంగా మహేష్ కూడా సమాధానం చెప్పడం ప్రేక్షకుల్లో నవ్వులు పూయిస్తోంది.

Balakrishna-Mahesh Babu
Balakrishna-Mahesh Babu

ఈక్రమంలోనే మహేశ్‌ కేబీఆర్‌ పార్క్‌కి ఎందుకు వెళ్లరో తెలిపాడు. అక్కడ ఓ పాము కనిపించింది అని, ఇక అప్పటి నుంచి మళ్ళీ ఆ పార్క్ సైడ్ కు వెళ్ళలేదు అని మహేష్ చెప్పిన విధానం ఫన్నీగా ఉంది. మొత్తానికి అన్ స్టాపబుల్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ ప్రోమో అదిరిపోయింది. బాలయ్యతో కలిసి సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి చేశాడు. మహేష్ తన వ్యక్తిగత జీవితం నుంచి షూటింగ్ లైఫ్ వరకు పంచుకోవడం కూడా చాలా బాగుంది. కాగా ఫిబ్రవరి 4న ‘ఆహా’లో ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది.

Also Read: వర్మ  ‘బాలయ్య షో’  పై చేసిన  ట్వీట్  ను ఎందుకు డిలీట్ చేశాడంటే.. ?

ఇక ఈ ఎపిసోడ్ లో మహేష్ మనసు విప్పి మాట్లాడాడు. అలాగే మహేష్ గతంలో ‘బసవతారకం క్యాన్సర్ ఫౌండేషన్ కి కొంత మొత్తాన్ని విరాళంగా ఇచ్చాడు. ఆ విషయాన్ని బాలయ్య ప్రస్తావించారు అని తెలుస్తోంది. ఆ సమయంలో తెలుగు రాష్ట్రాల్లోని బుర్రిపాలెం, మరియు సిద్దాపురం అనే రెండు గ్రామాలను తానూ దత్తత తీసుకున్నట్లు, ఆ గ్రామాల్లో తాను ఎలాంటి సేవా కార్యక్రమాలను చేపట్టాడు లాంటి విషయాలను కూడా మహేష్ ఈ ఎపిసోడ్ లో చెప్పారట.

ఎపిసోడ్ మొత్తంలో మహేష్ – బాలయ్య మధ్య జరిగిన సంభాషణలు ఇరువురు హీరోల ఫ్యాన్స్‌ కి ఫుల్ కిక్ ఇచ్చేలా ఉంటాయట. బాలయ్య – మహేష్ బుల్లితెరపై స్క్రీన్ స్పేస్ తో పాటు ఎమోషన్స్ ను, ఎక్స్ ప్రెషన్స్ ను కూడా షేర్ చేసుకోవడం ఆసక్తిగా ఉంటుంది. మరి ఈ ప్రత్యేక ఎపిసోడ్ కి భారీ స్థాయిలో వ్యూస్ వస్తాయని ఆహా టీమ్ నమ్మకంగా ఉంది. మరి బాలయ్య తమాషా ప్రశ్నలు.. మహేష్ చమత్కార సమాధానాలు ఎలా ఉంటాయో చూడాలి.

Also Read: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chennai Love Story

Chennai Love Story: ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమాను ఆ మూవీ నుంచి కాపీ చేశారా…ఈ సినిమాలో అసలు...

Chennai Love Story: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో ఎన్నో ప్రేమ కథ చిత్రాలు వచ్చాయి. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ సూపర్ సక్సెస్ గా నిలిచాయి. ఇక ఇలాంటి...
Mega Family

Mega Family: హీరోయిన్ ను పెళ్లి చేసుకోబోతున్న మరో మెగా ఫ్యామిలీ హీరో…

Mega Family: సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటీనటులు సినిమాల్లో నటించేటప్పుడు తమ తోటి ఆర్టిస్టులతో చాలా మంచి సాన్నిహిత్యాన్ని మైంటైన్ చేస్తుంటారు. దానివల్ల వాళ్ళకి మరికొన్ని సినిమాల్లో అవకాశాలు...
Balakrishna

Balakrishna: టైర్ వన్ హీరోలు బాలయ్య ను చూసి నేర్చుకోండి….

Balakrishna: నందమూరి నట సింహం బాలయ్య బాబు నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో విషయమైన అంచనాలు క్రియేట్ అవుతాయి. బాలకృష్ణ మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ భారీ రికార్డులను బ్రేక్...
Donald Trump

Donald Trump: మరో బాంబు పేల్చిన ట్రంప్‌..

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్‌ నినాదంతో ఆ దేశంలో అక్రమంగా ఉంటున్న విదేశీయులను తరిమి కొట్టే పని మొదలు పెట్టారు. తర్వాత...
Appalaraju Arrest

Appalaraju Arrest: అప్పలరాజును వెనుకేసుకొస్తున్న వైసిపి.. మరి అంత నీచమా?!

Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును...
Oktelugu Epaper