spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa: 'పుష్ప'తో బన్నీ కంటే.. మహేష్ కే ఎక్కువ డిమాండ్ వచ్చింది !

Pushpa: ‘పుష్ప’తో బన్నీ కంటే.. మహేష్ కే ఎక్కువ డిమాండ్ వచ్చింది !

Pushpa: తెలుగు సినిమాలకు హిందీ యూట్యూబ్‌ ప్లాట్ ఫామ్స్ లో ఫుల్ గిరాకీ ఉంది. అయితే, ఈ డిమాండ్ ను గోల్డ్‌మైన్స్‌ నిర్మాత మనీష్‌ షా చాలా ముందుగానే ఊహించాడు. ఏ హిందీ నిర్మాత తెలుగు సినిమాలను కొనకముందే.. గోల్డ్‌మైన్స్‌ నిర్మాత మనీష్‌ షా తెలుగు సినిమాలను కొని పెద్ద నిర్మాత అయిపోయాడు. ఎంత ఎదిగాడు అంటే.. తెలుగు హిట్‌ చిత్రాలను యూట్యూబ్‌లో డబ్బింగ్‌ కొట్టి, ఇప్పుడు నేరుగా థియేటర్లలో విడుదల చేసే స్థాయికి వచ్చాడు గోల్డ్‌మైన్స్‌ నిర్మాత మనీష్‌ షా.

Pushpa
Mahesh babu and Allu Arjun

కాగా పుష్ప దాదాపు రూ. 100 కోట్ల మార్కును చేరుకోగా, ఇకపై పలు తెలుగు పెద్ద హీరోల చిత్రాలను మనీష్‌ థియేటర్లో రిలీజ్‌ చేయాలనుకుంటున్నాడు. ప్రస్తుతం అల వైకుంఠపురములో వాయిదా పడగా, సుకుమార్‌ తెరకెక్కించిన రంగస్థలం చిత్రాన్ని ఫిబ్రవరిలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారట. మొత్తానికి అల్లు అర్జున్‌ పుష్ఫ నార్త్‌లో ఎంతపెద్ద హిట్‌ అయ్యిందో తెలిసిందే. యూట్యూబ్‌లో బన్నీ తెలుగు సినిమాలు హిందీలోకి డబ్‌ అవ్వడమే దీని వెనుకున్న కారణం.

Pushpa
Mahesh babu and Allu Arjun

Also Read: ‘పుష్ప’ నే కాదు, బన్నీని కూడా బాగా వాడుకుంటున్నారు !

అయితే, సూపర్ స్టార్ మహేష్ బాబు తెలుగు సినిమాలకి కూడా నార్త్‌ లో ఫుల్‌ డిమాండ్‌ ఉందట. తెలుగులో ఉన్నట్టే.. అక్కడా చాలామంది మహేష్ బాబుకు మహిళా ఫ్యాన్స్‌ ఉన్నారట. ఈ క్రమంలోనే సర్కారు వారి పాట హిందీ థియేట్రికల్‌ రైట్స్‌ కోసం ఓ బడా సంస్థ పోటీపడి పెద్ద మొత్తంలో కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. అయితే, మధ్యలో గోల్డ్‌మైన్స్‌ నిర్మాత మనీష్‌ షా వచ్చి.. ఆ నిర్మాత ఇచ్చిన మొత్తానికి కంటే రెట్టింపు ఇస్తాను.. సర్కారు వారి పాట హిందీ థియేట్రికల్‌ రైట్స్‌ ఇవ్వమని అడుగుతున్నాడట. మొత్తానికి పుష్పతో బన్నీ కంటే.. మహేష్ కే ఎక్కువ డిమాండ్ వచ్చింది.

Also Read: ఆ సంస్థపై ట్రోల్స్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్..!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Varanasi Movie

Varanasi Movie: వారణాసి అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందా…

Varanasi Movie: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న 'వారణాసి' సినిమా మీద ప్రేక్షకుల్లో విశేషమైన అంచనాలు ఉన్నాయి. ప్రపంచ స్థాయిలో ఈ సినిమా ఒక పెను సంచలనాన్ని క్రియేట్ చేయబోతుందనే...
Oktelugu Epaper