Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu And Trivikram Srinivas: త్రివిక్రమ్ సలహా మేరకు అప్పట్లో మహేష్ బాబు అలాంటి...

Mahesh Babu And Trivikram Srinivas: త్రివిక్రమ్ సలహా మేరకు అప్పట్లో మహేష్ బాబు అలాంటి సినిమాలు చేశాడా..?

Mahesh Babu And Trivikram Srinivas: సినిమా ఇండస్ట్రీలో వారసుల హవా ఎక్కువగా కొనసాగుతుంది. ప్రస్తుతం టాప్ హీరోలందరు వారసత్వ బ్యాగ్రౌండ్ తో వచ్చిన వారే కావడం విశేషం… నిజానికి వారసత్వం అనేది హీరోలకు ఎంట్రీ ఇప్పించడానికి సరిపోతుంది. కానీ ఆ తర్వాత నటుడిగా రాణించడానికి, సక్సెస్ లను సాధించడానికి ఏ బ్యాగ్రౌండ్ ఉపయోగపడదు. మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ఈ మధ్యకాలంలో చేస్తున్న సినిమాలతో భారీ విజయాలను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ తనకు గత కొద్దిరోజుల నుంచి అనుకున్న సక్సెసులైతే రావడం లేదు. ఎట్టకేలకు మహేష్ బాబు రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాతో ఎలాగైనా సరే పెను సంచలనాలను క్రియేట్ చేసే సినిమా చేయబోతున్నాను అంటూ ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నాడు…

ఇలా కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా మహేష్ బాబు ఎంచుకునే సినిమా స్టోరీలు చాలా వైవిధ్యంగా ఉంటూ వస్తున్నాయి. నాని లాంటి డిఫరెంట్ సబ్జెక్ట్ లను మహేష్ బాబు చేయడం అనేది చాలా గొప్ప విషయం…త్రివిక్రమ్ తో ఎప్పుడైతే అతడు సినిమా చేశాడో అప్పటి నుంచి మహేష్ బాబు కెరీర్ మారిపోయింది. ఆయనకి ఎలాంటి సినిమాలు సెట్ అవుతాయి. ఎలాంటి సినిమాలు ఆయన చేస్తే బాగుంటుందనే ఉద్దేశ్యంలో త్రివిక్రమ్ అతనికి ఎప్పటికప్పుడు సలహాలైతే ఇస్తూ వచ్చాడట.

దానివల్ల త్రివిక్రమ్ సలహా మేరకు సినిమాలను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను రాబట్టే ప్రయత్నం చేశాడు…అందుకే మహేష్ బాబుకి మాస్ లో ఇంత ఫాలోయింగ్ ఉందో, క్లాస్ ఆడియన్స్ లో కూడా అంతే క్రేజ్ దక్కింది. ఇక యూత్ లో ఆయనకున్న స్టార్ డమ్ మరే హీరోకి లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…

మొత్తానికైతే పాన్ ఇండియాలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకోవాలనే తాపత్రయంతో మహేష్ బాబు ముందుకు సాగుతున్నాడు. రాజమౌళి చేతిలో పడ్డాడు కాబట్టి మహేష్ బాబుకు భారీ విజయం దక్కడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం మెప్పించే విధంగా ఆయన సినిమా ఉంటుందని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular