Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu Krishna biopic: ఎన్టీఆర్ బయోపిక్ ను చూశాక...కృష్ణ బయోపిక్ మీద మహేష్ బాబు...

Mahesh Babu Krishna biopic: ఎన్టీఆర్ బయోపిక్ ను చూశాక…కృష్ణ బయోపిక్ మీద మహేష్ బాబు ఏం ఆలోచిస్తున్నాడు…

Mahesh Babu Krishna biopic: కొంతమంది నటులు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్స్ కి సంబంధించిన బయోపిక్ లను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టాలని చూస్తుంటారు… శిఫిక్షనల్ స్టోరీల కంటే బయోపిక్ కథలకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి డిమాండ్ ఉంది. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటిచెప్పిన నటుడు నందమూరి తారకరామారావు… ఆయన కొడుకు అయిన బాలకృష్ణ తన బయోపిక్ ని చేశాడు. అయితే రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా […]

Mahesh Babu Krishna biopic: కొంతమంది నటులు సినిమా ఇండస్ట్రీలో లెజెండరీ యాక్టర్స్ కి సంబంధించిన బయోపిక్ లను చేస్తూ ప్రేక్షకుల్లో విశేషమైన స్పందనను రాబట్టాలని చూస్తుంటారు… శిఫిక్షనల్ స్టోరీల కంటే బయోపిక్ కథలకు సినిమా ఇండస్ట్రీలో చాలా మంచి డిమాండ్ ఉంది. ఇక తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచం నలుమూలాల చాటిచెప్పిన నటుడు నందమూరి తారకరామారావు… ఆయన కొడుకు అయిన బాలకృష్ణ తన బయోపిక్ ని చేశాడు. అయితే రెండు పార్టులుగా తెరకెక్కిన ఈ సినిమా ఆశించిన మేరకు సక్సెస్ ను సాధించలేదు. దాంతో చాలామంది ఇప్పుడు బయోపిక్ లు చేయాలంటే భయపడిపోతున్నారు. నిజానికి సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడు అయిన మహేష్ బాబు సైతం వాళ్ళ నాన్న బయోపిక్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నప్పటికి ఎన్టీఆర్ బయోపిక్ ని ప్రేక్షకులు రిసీవ్ చేసుకున్న విధానాన్ని చూసిన మహేష్ బాబు కృష్ణ బయోపిక్ చేయకపోతేనే బెటరేమో అనే రీతిలో ఆలోచిస్తున్నారట.

కారణం ఏంటి అంటే కృష్ణ బయోపిక్ చేస్తే ప్రేక్షకులు దాన్ని స్వీకరిస్తే బాగుంటుంది. అలా కాకుండా తిరస్కరిస్తే దానిని జీర్ణించుకోవడం చాలా కష్టమవుతుందనే ఉద్దేశ్యంతోనే మహేష్ బాబు అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకున్నారట. ప్రస్తుతానికైతే కృష్ణ బయోపిక్ ను చేసే ఉద్దేశ్యం తనకు లేదని మహేష్ బాబు చెప్పేశాడు.

Also Read: రాకాస vs బైకర్…రెండిటిలో హిట్ కొట్టిన సినిమా అదే…

ఇక ఫ్యూచర్ లో చేసే చేసే అవకాశాలు ఉన్నాయా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… ఇక ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో ‘వారణాసి’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

ఇక వీలైనంత తొందరగా ఈ సినిమాను పూర్తి చేసి షూటింగ్లో తను పాల్గొనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఏది ఏమైనా కూడా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క సినిమా చేయకపోయిన కూడా డైరెక్ట్ గా పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది అభిమానులను ఆనందపరుస్తుంది. నిజానికి రాజమౌళి వల్లే ఇది సాధ్యమవుతుందనే చెప్పాలి…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper