Homeఎంటర్టైన్మెంట్Rakasa vs Biker: రాకాస vs బైకర్...రెండిటిలో హిట్ కొట్టిన సినిమా అదే...

Rakasa vs Biker: రాకాస vs బైకర్…రెండిటిలో హిట్ కొట్టిన సినిమా అదే…

Rakasa vs Biker: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తమ హవాని చూపిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిహారిక కొనిదల ప్రొడ్యూసర్ గా వచ్చిన ‘రాకాస’ సినిమా ఈ వారం రిలీజ్ అయింది. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన ‘బైకర్’ సినిమా సైతం రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. ఈ రెండింటిలో ఏ సినిమా డీలా పడిపోయింది అనే విషయాలను మనం ఒకసారి […]

Rakasa vs Biker: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాలు తమ హవాని చూపిస్తూ ముందుకు సాగుతున్నాయి. నిహారిక కొనిదల ప్రొడ్యూసర్ గా వచ్చిన ‘రాకాస’ సినిమా ఈ వారం రిలీజ్ అయింది. అలాగే శర్వానంద్ హీరోగా వచ్చిన ‘బైకర్’ సినిమా సైతం రీసెంట్ గా రిలీజ్ అయింది. ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంది. ఈ రెండింటిలో ఏ సినిమా డీలా పడిపోయింది అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకుందాం…

రాకాస సినిమా ప్రీమియర్ షో తోనే పాజిటివ్ టాక్ ని సంపాదించుకొని ముందుకు దూసుకెళ్తుంది. ముఖ్యంగా ఈ సినిమా కామెడీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. కాబట్టి ఈ సినిమాని చూస్తున్న ప్రేక్షకులందరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మొత్తానికైతే ‘కమిటీ కుర్రాళ్ళు’ సినిమా తర్వాత నిహారిక కొణిదల చేసిన ఈ సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. అయితే ఈ సినిమాలో కొన్ని మైనస్ లు ఉన్నప్పటికి వీటిని ప్రేక్షకులు పట్టించుకోకుండా ఈ సినిమాని చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తుండటం విశేషం…

Also Read: అనవసరంగా ‘బైకర్’ సినిమా చేశానంటూ సీనియర్ హీరో రాజశేఖర్ సంచలన కామెంట్స్..

శర్వానంద్ హీరోగా వచ్చిన ‘బైకర్’ సినిమా సైతం మొదటి షో తోనే పాజిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. అయితే ఈ సినిమా సెకండాఫ్ కొంత వరకు డల్ అయిందనే వార్తలు వస్తున్నప్పటికి ఓవరాల్ గా సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేస్తుందనే చెప్పాలి. ఎమోషనల్ సన్నివేశాలు కూడా ప్రేక్షకుడిని హత్తుకునే విధంగా ఉన్నాయంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు…

ఇక ఈ రెండు సినిమాల్లో బైకర్ సినిమా రాకాసి మూవీ కంటే ఒక అడుగు ముందు వరుసలో ఉంది. ఎక్కువమంది ప్రేక్షకులు ఈ సినిమాను చూడడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటి అంటే ఇది ఒక స్పోర్ట్స్ డ్రామా కు సంబంధించిన సినిమా అలాగే రాజశేఖర్ లాంటి ఒక సీనియర్ హీరో ఉన్నాడు. శర్వానంద్ రాజశేఖర్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు సైతం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయట. మౌత్ పబ్లిసిటి తో ఈ సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటూ ముందుకు సాగుతుంది… రాకాస సినిమా కూడా బాగున్నప్పటికి బైకర్ మూవీ తో పోలిస్తే ఇంతవరకు డల్ అయిందనే చెప్పాలి. ఇక ఈ వారం ‘బైకర్’ సినిమా విన్నర్ గా నిలవడం అనేది ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper