Homeఎంటర్టైన్మెంట్Mahesh Babu And Namrata: మహేష్ బాబు విషయంలో నమ్రత చాలా కేర్ ఫుల్ గా...

Mahesh Babu And Namrata: మహేష్ బాబు విషయంలో నమ్రత చాలా కేర్ ఫుల్ గా ఉండటానికి కారణం ఇదే…

Mahesh Babu And Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో తెలుగులో మాత్రమే సత్తా చాటాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో అంతకు మించి అంటున్నాడు. రాజకుమారుడు సినిమా నుంచి గుంటూరు కారం సినిమా వరకు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్న కూడా ముందుగా […]

Mahesh Babu And Namrata: సూపర్ స్టార్ మహేష్ బాబు తనదైన రీతిలో సత్తా చాటుతున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలతో తెలుగులో మాత్రమే సత్తా చాటాడు. ఇప్పుడు చేస్తున్న సినిమాలతో అంతకు మించి అంటున్నాడు. రాజకుమారుడు సినిమా నుంచి గుంటూరు కారం సినిమా వరకు ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీకి మాత్రమే పరిమితమయ్యాడు. కానీ ఇప్పుడు ‘వారణాసి’ సినిమాతో ప్రపంచ స్థాయి హీరోగా మారాలనే ప్రయత్నం చేస్తున్నాడు…మహేష్ బాబు ఏ సినిమా చేయాలన్న కూడా ముందుగా తన భార్య అయిన నమ్రత గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలి. సినిమాల విషయంలోనే కాకుండా తన హెల్త్ విషయంలో గాని ఇతర విషయాల్లో గాని నమ్రత చాలా కేర్ఫుల్ గా వ్యవహరిస్తుందట. మహేష్ బాబు ఏం తినాలి అనేది కూడా తనే డిసైడ్ చేస్తుందనే వార్తలైతే వస్తున్నాయి. నమ్రత మొదటి నుంచి కూడా మహేష్ బాబు ను చాలా ఇష్టంగా చూసుకుంటూ వస్తుంది. ఆయనంటే తనకు ప్రాణమని పలు సందర్భాల్లో కూడా చెప్పింది. ఇక ఏది ఏమైనా కూడా నమ్రతవల్లే మహేష్ బాబు ఈ స్థాయిలో ఉన్నాడని కొంతమంది చెబుతుంటారు.

ఎందుకంటే సినిమాల సెలక్షన్ లలో తనకు చాలా నాలెడ్జ్ ఉంది. మహేష్ బాబుకి ఎలాంటి సినిమాలు నచ్చుతాయి. వాళ్ళ అభిమానులు తన నుంచి ఎలాంటి సినిమాని కోరుకుంటున్నారు అనేది ఎప్పటికప్పుడు మహేష్ బాబు అభిమానులతో మాట్లాడి మరీ తెలుసుకుంటారట.

ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతం ఆమె మహేష్ బాబును చాలా జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడుగా తెలుస్తుంది…వారణాసి సినిమాతో మహేష్ బాబు రేంజ్ మారిపోబోతుంది. కాబట్టి ఇప్పటినుంచే తనతో కొంతమంది డైరెక్టర్స్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నమ్రత మాత్రం మహేష్ బాబు తదుపరి చేయబోయే సినిమా కథలు పాన్ వరల్డ్ లో ఉండే విధంగా సెలెక్ట్ చేసి పెడుతుందట.

ఇక ఇప్పటివరకు అఫీషియల్ గా ఏ ఒక దర్శకుడిని కూడా కన్ఫామ్ చేయలేదు. ఆమె కథలను విని ఆ స్టోరీలను హోల్డ్ లో పెడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక 2027వ సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ‘వారణాసి’ సినిమా రిలీజ్ అవుతుంది. కాబట్టి మహేష్ బాబు స్టార్ హీరోగా మారుతాడా లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper