Pawan Kalyan helped Mahesh Babu: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉంటుంది. సినిమాలతో పోటీ పెట్టుకున్నప్పటికి వాళ్ల పర్సనల్ విషయాల్లో మాత్రమే వాళ్ళు చాలా కూల్ గా ఉంటారు. ఒకరి ఫంక్షన్లకు ఒకరు అటెండ్ అవుతూ ఒకరికొకరు విషెస్ చెప్పుకుంటూ ఉంటారు. కానీ వాళ్ల కోసం అభిమానులు మాత్రమే కొట్టుకు చూస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపును సంపాదించుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సైతం పలు సినిమాలను చేస్తూ తనకంటూ ఒక క్రేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు…
తనతో పాటుగా ఇండస్ట్రీకి వచ్చిన మహేష్ బాబు సైతం కొంతవరకు డౌన్ ఫాల్ అయినప్పటికి ఆ తర్వాత స్టార్ హీరో గా రాణిస్తూ ప్రస్తుతం ‘వారణాసి’ సినిమాతో ఫ్యాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నం చేస్తున్నాడు… కెరియర్ స్టార్టింగ్ లో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు మధ్య మంచి బాండింగ్ ఉంది. ఇప్పటికీ అదే ఫ్రెండ్షిప్ ను మెయింటైన్ చేస్తున్నారు. ‘అర్జున్’ సినిమా సమయంలో ఆ సినిమా పైరసీ బారిన పడడంతో మహేష్ బాబు ఒంటరిగా పోరాటం చేస్తున్నప్పుడు తనకు అండగా పవన్ కళ్యాణ్ నిలిచాడు.
ఓపెన్ గా మీడియా ముందుకు వచ్చి అర్జున్ సినిమా పైరసీని అరికట్టాలి అంటూ పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చాడు. దాంతో పవన్ కళ్యాణ్ అభిమానులు సైతం సినిమా పైరసీ ఎక్కడ కనిపిస్తే అక్కడ తగలబెట్టేసారు. అర్జున్ సినిమా ఎబో ఆవరేజ్ గా నిలవడానికి పవన్ కళ్యాణ్ సైతం సహాయం చేశారనే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఇప్పటికి ఆ విషయాన్ని చాలా సందర్భాల్లో గుర్తు చేసుకుంటూ ఉంటాడు…
రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కూడా ఆ ప్రస్తావన వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ గురించి ఆయన మాట్లాడటం విశేషం… ఇక ఏది ఏమైనా కూడా మహేష్ బాబు – పవన్ కళ్యాణ్ ల మధ్య ఇప్పటికి మంచి ఫ్రెండ్షిప్ ఉండడం అనేది ప్రతి ఒక్కరిని సంతోషపడేలా చేస్తుంది. ముఖ్యంగా ఇటు పవన్ కళ్యాణ్ అభిమానులు అటు మహేష్ బాబు అభిమానులు సైతం హ్యాపీగా ఫీలవుతున్నారు…