Manchu Vishnu Ginna: మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ప్రెసిడెంట్ మంచు విష్ణు హీరో గా నటించిన జిన్నా సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..ఈ సినిమా ఈరోజు విడుదలైంది అనే విషయం కూడా చాలా మందికి తెలియని పరిస్థితి ఏర్పడింది..పాపం మంచు అన్న ఈ సినిమాకి హైప్ తీసుకొని రావడానికి చాలా కష్టపడ్డాడు..సన్నీ లియోన్ మరియు పాయల్ రాజ్ ఫుట్ వంటి క్రేజీ స్టార్ హీరోయిన్స్ ని ఈ సినిమాలో పెట్టుకున్నాడు..కానీ హైప్ మాత్రం అసలు ఏర్పర్చలేకపోయాడు.

మంచు విష్ణు లేకుండా సన్నీ లియోన్ – పాయల్ రాజ్ పుట్ కలిసి సినిమా చేసి ఉంటె కనీసం మినిమం గ్యారంటీ హైప్ మరియు ఓపెనింగ్స్ అయినా వచ్చేదేమో, కానీ మంచు విష్ణు ఇమేజి కారణంగా ఈ సినిమాకి కనీస స్థాయి హైప్ కూడా రాలేదు..చివరికి విష్ణు మెగాస్టార్ చిరంజీవి కుటుంబం పై పరోక్షంగా సెటైర్స్ వేసి ఈ సినిమాకి హైప్ రప్పించే ప్రయత్నం కూడా చేసాడు..కానీ ఫలితం మాత్రం సూన్యం.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఒక అరుదైన రికార్డుని నెలకొల్పింది..అదేమిటి అంటే ఈ చిత్రానికి హైదరాబాద్ సిటీ మొత్తానికి కలిపి 150 షోస్ కి గాను 340 టిక్కెట్లు అమ్ముడుపోయాయి..గతం లో మోహన్ బాబు గారి ‘సన్ ఆఫ్ ఇండియా’ చిత్రానికి హైదరాబాద్ మొత్తం మీద 50 టిక్కెట్లు మాత్రమే అడ్వాన్స్ బుకింగ్స్ లో తెగాయి..కానీ మంచు విష్ణు జిన్నా కి మాత్రం ఏకంగా 340 టిక్కెట్లు తెగడం విశేషం.

ఆ విధంగా తండ్రి మోహన్ బాబు ని దాటేసి తండ్రి ని మించిన తనయుడు అనిపించుకున్నాడు మన మంచు విష్ణు..ఇంత గొప్ప స్టార్ స్టేటస్ ఉన్న హీరో పై చిరంజీవి కుటుంబం ప్రత్యేకంగా ట్రోల్ చెయ్యడానికి IT ఎంప్లాయిస్ ని పెట్టుకోవడం లో ఆశ్చర్యం లేదని అంటున్నారు విశ్లేషకులు..మంచు విష్ణు ఈ సినిమాకి ముందు అలా ఆరోపించడం లో కూడా అర్థం ఉంది అంటున్నారు..మొదటి రోజే ఇలాంటి అద్భుతమైన రికార్డుని నెలకొల్పిన జిన్నా సినిమా రాబొయ్యే రోజుల్లో ఇంకా ఎన్ని అద్భుతాలు సృష్టించబోతుందో చూడాలి.